మ‌న‌సులో మాట బ‌య‌ట‌కు రాదేంటి జ‌గ‌న్‌

Why Jagan mohan reddy Silent On Karnataka Elections 2018

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డికి భ‌లే సంక‌టం వ‌చ్చిప‌డింది. కీల‌క‌మైన సంద‌ర్భంలో న‌మ్మిన‌బంటు, అత్యంత ఆప్తుడి కోసం ఆయ‌న నోరు మెద‌ప‌లేక‌పోతున్నారు. త‌న‌తోటి రాజ‌కీయ నాయ‌కులంతా బిజీబిజీగా ఉంటే…కేవ‌లం ప‌రిచ‌య‌స్థుల కోస‌మే ప్ర‌చారంలో బిజీబిజీ అయిపోతే…వైసీపీ అధ్య‌క్షుడు మాత్రం త‌న‌కేం ప‌ట్ట‌న‌ట్లు ఉండిపోయారు. ఇదంతా దేని గురించి అంటే…క‌ర్ణాట‌క ఎన్నిక‌ల గురించి. అందులో బ‌రిలో దిగిన త‌న అత్యంత ఆప్తుడు, మైనింగ్ కింగ్‌ గాలి జ‌నార్ద‌న్ రెడ్డి అనుచ‌రులకు మ‌ద్ద‌తు గురిచింది.

జాతీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై ప్రాంతీయ పార్టీలు సీరియస్ గా దృష్టి పెట్టాయి. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్ర‌తిప‌క్షంలో ఉన్న బీజేపీలు నువ్వా….నేనా అన్నట్లు తలపడుతున్నాయి. ఇదే స‌మ‌యంలో కర్ణాటకకు చెందిన‌ ప్రాంతీయ పార్టీ అయిన జేడీఎస్ కూడా తన పట్టు నిరూపించుకునేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు వస్తున్న సర్వే ఫలితాలు ఏ పార్టీకి పూర్తి మెజార్టీ ఇవ్వకపోవడంతో.. ఈ ఎన్నికలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ప్రధానంగా తెలుగు రాష్ర్టాల‌కుకు పొరుగున ఉన్న రాష్ట్రం కావడంతో స‌హ‌జంగానే తెలుగు వారి దృష్టి కూడా ప‌డింది. ఈ నేప‌థ్యంలో మ‌న రాష్ర్టానికి చెందిన కాంగ్రెస్‌, బీజేపీ నేత‌లు కూడా ప్ర‌చారంలో క్రియాశీలంగానే పాలుపంచుకుంటున్నారు. త‌మ త‌మ పార్టీల నేత‌ల‌కు మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేస్తున్నారు. అయితే ఇప్ప‌టివ‌ర‌కు వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి మాత్రం త‌న స్టాండ్ ఏంటో ప్ర‌క‌టించ‌లేదు.

చిత్రంగా ఈ ఎన్నికలు జ‌గ‌న్ అత్యంత ఆప్తుడ‌నే పేరున్న మైనింగ్ కింగ్ గాలి జ‌నార్ద‌న్ రెడ్డికి ప్ర‌తిష్టాత్మ‌కంగా మారాయి. గాలి ఆప్తుడైన శ్రీ‌రాములు ఏకంగా ముఖ్య‌మంత్రి సిద్ధ‌రామ‌య్య‌పైనే పోటీ చేస్తున్నారు. మ‌రోవైపు గాలి సోద‌రుడు సైతం బ‌రిలో ఉన్నాడు. ఈ నేప‌థ్యంలో స‌ర్వం తానై గాలి ఎత్తులు వేస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ వైఎస్ జ‌గ‌న్ క‌న్న‌డ పోరులో అక్క‌డి తెలుగువారు ఎవ‌రికి ఓటు వేయాలో చెప్ప‌డం లేదు. ఆప్తుడికి ప‌రువు స‌మ‌స్య ఎదురైన‌ప్ప‌టికీ జ‌గ‌న్ మౌనం దాల్చ‌డం స‌హ‌జంగానే చ‌ర్చ‌నీయాంశం అయింది.

Related posts

Leave a Comment