సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

why anuppama paramenswaran movies in tollywood?

why anuppama paramenswaran movies in tollywood?
అనుపమ తెలుగులోనే చేయడానికి కారణం?
మలయాళ చిత్రంలో నాగార్జున
చరణ్ తాజా చిత్రం షెడ్యూల్ పూర్తి
న్యూయార్క్ లో చైతూ ‘సవ్యసాచి’
* తనకు తెలుగులోనే మంచి ఆఫర్లు వస్తున్నాయని అంటోంది కథానాయిక అనుపమ పరమేశ్వరన్. ‘మలయాళం, తమిళంలో కూడా చేస్తున్నప్పటికీ, తెలుగు నుంచే నాకు మంచి ఆఫర్లు వస్తున్నాయి. ప్రతి పాత్ర కొత్తగా ఉంటోంది. అందుకే తెలుగుకే ప్రాధాన్యతనిస్తున్నాను’ అని చెప్పింది అనుపమ.
* అక్కినేని నాగార్జున మలయాళంలో ఓ చిత్రం చేసే అవకాశం కనిపిస్తోంది. మోహన్ లాల్ హీరోగా ప్రియదర్శన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘మరక్కార్’ పిరీడ్ మూవీలో ఓ కీలక పాత్రకు నాగార్జునను సంప్రదిస్తున్నట్టు తాజా సమాచారం. ఇందులో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్నాడు.
* రామ్ చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతున్న భారీ చిత్రం తాజా షెడ్యూల్ షూటింగ్ ముగిసింది. ఈ షెడ్యూల్ లో కొన్ని సీన్స్ తో పాటు చరణ్, ఫైటర్స్ పై ఓ యాక్షన్ ఎపిసోడ్ ను కూడా చిత్రీకరించారు.
* అక్కినేని నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న ‘సవ్యసాచి’ చిత్రం షూటింగ్ నిన్న న్యూయార్క్ లో మొదలైంది. చైతూ, వెన్నెల కిషోర్, షకలక శంకర్ తదితరులపై ప్రస్తుతం సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.

Related posts

Leave a Comment