‘పయ్యావుల’ ఆచూకీ చెప్పండి…!?

where is uravakonda mlc payyavula kesav
2004,2009లో ఉరవకొండ నుంచి విజయం సాధించిన పయ్యావుల కేశవ్‌ 2014లో ఓడిపోవడం, ఆ తరువాత ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్నారు. మళ్లీ ఉరవకొండ నియోజకవర్గ ఇన్‌ఛార్జి హోదాలో పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇటీవలే ఆయనకు కౌన్సిల్‌ విప్‌ పదవి లభించింది. ఓటర్లు తనను ఎమ్మెల్యేగా ఓడించారు..తాను స్థానికంగా ఉండాల్సిన అవసరం లేదని ఆయన హైదరాబాద్‌, బెంగుళూరుల్లో వ్యాపార లావాదేవీల్లో మునిగితేలుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ తనయుడుతో తన దగ్గర బంధువులతో కలసి వ్యాపారాలు ప్రారంభించారు. అందుకే…ఆయన హైదరాబాద్‌లో ఎక్కువ సమయం ఉంటూ ఉరవకొండ వైపు కన్నెత్తి చూడడం లేదు. మంత్రి పదవి ఆశించారు..ఆ పదవి దక్కదని తెలుసుకుని, కౌన్సిల్‌ పదవితో తృప్తిపడి..వ్యాపారాలపై దృష్టిసారించారట ఆయన. ఈ పరిస్థితుల్లో నియోజకవర్గ ఇన్‌ఛార్జి పదవిని నుంచి ఆయనను తప్పించి..వేరే వారికి ఆ స్థానాన్ని కట్టబెట్టాలని..మంత్రి లోకేష్‌ను కొందరు నాయకులు కోరారు. ప్రస్తుత వైకాపా ఎమ్మెల్యేపై ఓటర్లల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఆ పార్టీ కార్యకర్తల్లోనూ ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఉంది.

  మాజీ కమ్యూనిస్టుగా పేరున్న ఉరకొండ ఎమ్మెల్యే విశ్వేరరెడ్డి నియోజకవర్గం కన్నా..అనంతపురంలో ఎక్కువ సమయం గడుపుతున్నా దాన్ని అనుకూలంగా మలచుకోవడంలో ‘కేశవ్‌’ ఘోరంగా విఫలమయ్యారు. ఇదే విషయంపై పార్టీ అధినేత ‘చంద్రబాబు’ ఆయనను హెచ్చరిస్తూ..పార్టీ కార్యకర్తలు, నాయకులకు దూరం అవుతున్నావని హెచ్చరించారట. నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో ఉరవకొండ నియోజకవర్గ ఇన్‌ఛార్జి, కౌన్సిల్‌ చీఫ్‌విప్‌ కనిపించడం లేదు..ఆచూకీ తెలపండి..అని..కార్యకర్తలు వ్యంగ్యంగా పార్టీ నాయకులను అడుగుతున్నారు..చిన్నపాటి వాల్‌పోస్టర్లను ముద్రించి అతికిస్తున్నారు. ఇదంతా కేవలం…టిడిపిలోని ఒక వర్గంలోని వారు చేస్తోన్న దుప్రృచారమని, తాను ప్రజలకు అందుబాటులో ఉంటున్నానని, తమ నాయకుడు కనిపించడం లేదని కరపత్రాలు ముద్రించిన విషయం అవాస్తవమని, ఎవరో చేసిన పిల్లచేష్టలను పట్టించుకోనవసరం లేదని పయ్యావుల అనుచరులు చెబుతున్నారు. అయితే ‘కేశవ్‌’ హైదరాబాద్‌, బెంగుళూరుల్లో వ్యాపారాలు నిర్వహిస్తూ బిజీగా ఉంటున్నారనేది వాస్తవం. మంత్రి పదవి దక్కలేదనే బాధ, ఆవేదన ఆయనలో ఉంది. భవిష్యత్‌లో కూడా మంత్రి పదవి దక్కుతుందన్న నమ్మకం ఆయనలో లేదు. ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచినా..సెంటిమెంట్‌తో టిడిపి పార్టీ ఓడిపోతే…పరువు పోతుందన్న భయంతో ఆయన ఉరవకొండకు దూరంగా ఉంటున్నారట.

Related posts

Leave a Comment