వాట్సాప్ నుంచి మరో కొత్త ఫీచర్.. రిప్లై ఇచ్చేందుకు ఇక స్వైప్ చేస్తే సరి!

whatsapp latest features for replay

ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది మెసేజింగ్ యాప్ వాట్సాప్. ఈ కోవలోనే ఇప్పుడు మరో ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ‘స్వైప్ టు రిప్లై’ పేరుతో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ఈ ఆప్షన్‌ను తీసుకొస్తోంది. ప్రస్తుతం బీటా వెర్షన్‌లో ఉంది. ఈ ఆప్షన్‌తో యూజర్లు మెసేజ్‌ను కుడివైపునకు స్వైప్ చేయడం ద్వారా రిప్లై ఇవ్వవచ్చు. తమకు వచ్చిన మెసేజ్‌కు రిప్లై ఇవ్వాలనుకుంటే యూజర్లు ఇప్పటి వరకు ఆ మెసేజ్‌పై ట్యాప్ చేయాల్సి వచ్చేది. ఇకపై ఆ బాధ తప్పినట్టే. మెసేజ్‌ను పక్కకి జరపడం ద్వారా రిప్లై ఇవ్వవచ్చు. ఐవోఎస్ యూజర్లకు ఇప్పటికే ఈ ఆప్షన్ అందుబాటులో ఉంది. ఇప్పుడు ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి తెచ్చే పనిలో తలమునకలై ఉంది.
Tags: whatsapp, latest feature, replay,swipe

Related posts

Leave a Comment