ఈఎంఐల‌కు ఓకే చెప్పి ల‌వ్వ‌ర్‌ను సొంతం చేసుకున్నాడు

Variety Ending For a Love Story In Tamil Nadu

తొంగిచూస్తే చాలా అంశాలు చాలా చిత్రంగా అనిపిస్తాయి. నిజ‌మేనా?  సాధ్య‌మేనా? అన్న‌ట్లుగా ఉంటాయి. అలాంటి ఉదంత‌మే ఒక‌టి తాజాగా త‌మిళ‌నాడులో చోటు చేసుకుంది. తాను ప్రేమించిన యువ‌తికి పెళ్లి అయిన త‌ర్వాత కూడా వెరైటీగా సొంతం చేసుకున్న ఉదంతం స్థానికంగా సంచ‌ల‌నంగా మారింది. త‌మిళ‌నాడులోని తిరుచ్చి జిల్లా మ‌న‌ప్పారై స‌మీప ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల దేవి.. చ‌దువుకునే రోజుల్లో  ఓ కుర్రాడ్ని ప్రేమించింది. అత‌న్నే పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పింది. అయినా ఆమె త‌ల్లిదండ్రులు దేవి మాట‌ల్ని ప‌ట్టించుకోలేదు. స‌మీప బంధువైన ఆమె మేన‌మామ‌కు ఇచ్చి పెళ్లి చేశారు.  ప్రేమించిన వ్య‌క్తికి బ‌దులుగా మ‌రొక‌రితో పెళ్లి చేయ‌టాన్ని ఇష్ట‌ప‌డ‌ని దేవి.. త‌ర్వాత భ‌ర్తకు చెప్ప‌కుండా ప్రియుడి దగ్గ‌ర‌కు వెళ్లిపోయింది.

దీంతో.. ఆమె కోసం పోలీసుల‌కు కంప్లైంట్ ఇవ్వ‌టం.. ఆమెను వెతికి పోలీసులు తీసుకురావ‌టం అల‌వాటైంది. ఇలా రెండుసార్లు ఇప్ప‌టికి జ‌రిగాయి. మూడో సారి ఇలానే జ‌ర‌గ‌టంతో.. అస‌లు స‌మ‌స్య ఏమిటంటూ దేవిని ప్ర‌శ్నించారు పోలీసులు. త‌న భ‌ర్త‌తో కాపురం చేయ‌టం త‌న‌కు ఇష్టం లేద‌ని.. ప్రేమించిన ప్రియుడి ద‌గ్గ‌ర‌కు వెళ్లిపోతాన‌ని తేల్చి చెప్పింది దేవి. దీంతో సుదీర్ఘంగా సాగిన పంచాయితీ చివ‌ర‌కు ఓ చిత్ర‌మైన ప‌రిష్కారానికి వ‌చ్చారు. పెళ్లి త‌ర్వాత దేవిని ఎంఈ చ‌దివించ‌టానికి తాను ల‌క్ష రూపాయిల్ని ఖ‌ర్చు చేశాన‌ని.. ఆ మొత్తాన్ని తిరిగి ఇస్తే త‌న భార్య‌ను వ‌దులుకుంటాన‌ని చెప్పాడా వ్య‌క్తి. దీంతో ప్రేమించిన ప్రియుడు ఒక్క‌సారే ల‌క్ష మొత్తాన్ని చెల్లించ‌లేన‌ని.. విడ‌త‌ల వారీగా వాయిదాల రూపంలో చెల్లిస్తాన‌ని హామీ ఇవ్వ‌టం.. దీనికి దేవి భ‌ర్త ఓకే అన‌టంతో.. ప్రియుడి ద‌గ్గ‌ర‌కు పంపేసేలా నిర్ణ‌యం తీసుకున్నారు. ఇచ్చిన హామీకి త‌గ్గ‌ట్లు తొలి విడ‌త‌గా రూ.25వేల మొత్తాన్ని చెల్లించి దేవిని త‌న‌తో తీసుకెళ్లాడు ప్రియుడు.

Related posts

Leave a Comment