యాంకర్ ప్రదీప్ చెప్పినా పట్టించుకోని యువతులు… అర్థరాత్రి తప్పతాగి…

Two women caught in drunk and drive case in hyderabad

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో అర్థరాత్రివేళ మద్యం సేవించి ఇష్టానుసారం కార్లు నడుపుతున్నవారి సంఖ్య రానురాను ఎక్కువవుతోంది. ఐతే పోలీసులు మాత్రం మద్యం సేవించి వాహనం నడిపేవారి తాట తీస్తున్నారు. ఇటీవలే యాంకర్ ప్రదీప్ మద్యం తాగి కారు నడుపుతూ అడ్డంగా బుక్కయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తనే మీడియాముఖంగా మాట్లాడుతూ… తను చేసింది తప్పేననీ, మద్యం తాగి కారు నడపడం చాలా చాలా తప్పని చెప్పాడు. తనలా భవిష్యత్తులో మరెవరూ తప్పు చేయవద్దని కూడా విజ్ఞప్తి చేశాడు.

ప్రదీప్ అంతగా చెప్పినప్పటికీ యువత మాత్రం రాత్రిపూట మద్యం తాగి వాహనాన్ని నడపడం మానుకోవడంలేదు. తాజాగా జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 45లో అర్ధరాత్రి మద్యం తాగి నడుపుతూ వచ్చిన ఇద్దరు యువతులు ఓ స్థాయిలో హంగామా సృష్టించారు. శ్వాస పరీక్షలు చేయాలని పోలీసులు వారి వాహనాలను నిలుపగా మొండికేయడమే కాకుండా పోలీసులకు సవాళ్లు వేశారు.

ఐతే పోలీసులు మెల్లగా వారిని ఒప్పించి పరీక్షలు చేయగా ఒకరు 97 బీఏసీ మద్యం తాగినట్లు తేలగా మరో యువతి కూడా అదేస్థాయిలో మద్యం తీసుకున్నట్లు తేలింది. దీనితో వారి కార్లను సీజ్ చేసి తల్లిదండ్రులను తీసుకుని కౌన్సిలింగుకు రావాలని పోలీసులు వారికి చెప్పారు. ఒకవైపు మద్యం సేవించి రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు పోగొట్టుకుంటున్నవారు అధికమవుతున్నా… వీరిలో మాత్రం మార్పు రావడంలేదు మరి.

Tags: two womens, girls, caught , pradeep car,drunk and drive

Related posts

Leave a Comment