ముందస్తు వ్యూహాలు !

తెలంగాణలో ముందస్తు ప్రకటించిన తర్వాత తెరాసాకు ప్రతికూల గాలులు వీస్తున్నట్లు తెలుసుకున్న తెరాస అధిష్టానం, ప్రతిపక్షాల ఓటమికి వ్యూహం పన్నింది. ఈ వ్యూహంలో భాగమే రేవంత్ రెడ్డి ఇంటిపై హఠాత్తుగా ఐటి దాడులు, సోదాలు.

మూడు సంవత్సారాల క్రితం జరిగిన కేసును ఎన్నికల ముందు తేరపైకి తెచ్చి ప్రత్యుర్దులను ఇరుకున పెట్టి, తద్వారా లబ్ది పొందుదామని తెలంగాణ రాష్ట్ర సమితి భావిస్తున్నట్లు జ‌నం అనుకుంటున్నారు. తెలంగాణలోని శాసనమండలి ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి నామినేటడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను తమకు అనుకూలంగా ఓటు వేయాలని తెలుగుదేశం పార్టీ ప్రయత్నించిన‌ట్లు నేరారోప‌ణ‌లు వ‌చ్చాయి. ఇది పెద్ద ర‌చ్చ అయ్యింది. ఈ మేరకు స్టీఫెన్ సన్‌కు 50 లక్షలు ముట్టచెప్పిందని పోలీసులు వెల్ల‌డించారు. ఈ వ్యవహారాన్ని స్వయంగా రేవంత్ రెడ్డి నడిపించినట్లు సమాచారం ఉండ‌టంతో ఆయ‌న జైలుకు కూడా వెళ్లొచ్చారు. అయితే అప్పట్లో ఈ వార్త పెద్ద సంచలనం అయినప్పటికీ, తర్వాత దాని గురించి ఎవరూ ప్రస్తావించాలేదు. మళ్లీ మూడు సంవత్సారాల తర్వాత ఈ కేసును తిరగతోడడంలో ఇదంతా ఎన్నికలలో ఓటమి భయంతో తెరాస నాయకత్వమే చేయిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కెసీఆర్ ఓటమే లక్ష్యంగా మహాకూటమి పేరుతో పార్టీలన్నీ ఏకమయ్యాయి. వీటిని ఎదురుకోవాలంటే ఎదురుదాడే సరైన మార్గమని తలచి పాత కేసులన్నీ తిరగతోడుతున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిండెంట్ అయిన రేవంత్‌ రెడ్డికి తన నియోజకవర్గంలో మంచి పలుకుబడి ఉంది, ఆయన ఏ పార్టీనుంచి పోటి చేసిన అక్కడ గెలుస్తారన్నది అక్షర సత్యం. రేవంత్ రెడ్డిని ఆయన నియోకవర్గంలోనే ఓడించాలని తెరాస తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే రామారావు అనే న్యాయవాది ద్వారా కేసును తిరగతోడించి తద్వారా ఆయనను జైలుకు పంపడమే లక్ష్యంగా తెరాస పార్టీ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
Tags: Revanth Reddy IT Raids ,Revanth Reddy KCR,elections 2018 pyuhaalu

Related posts

Leave a Comment