అత్యంత చెత్త పాస్ వర్డ్ లలో టాప్ 10 ఇవే!

worst password ever list,dragon,keyboard
 • ఆన్ లైన్ వేదికగా జరిపే లావాదేవీలకు పాస్ వర్డ్ తప్పనిసరి
 • వీక్ పాస్ వర్డ్ లతో సైబర్ దాడుల బారిన పడే ప్రమాదం
 • పాస్ వర్డ్ ఎంత బలంగా ఉంటే ముప్పు అంత తక్కువ

బ్యాంక్ అకౌంట్, రీఛార్జ్, షాపింగ్, మొబైల్‌ ఫోన్‌, లాప్‌ టాప్‌, ఈ మెయిల్‌, ట్విట్టర్‌, ఫేస్‌ బుక్‌, డోర్‌ లాక్‌, బీరువా లాక్‌, డిజిటల్‌ లాకర్‌, వైఫై, మొబైల్‌ బ్యాంకింగ్‌, ఏటీఎం, ఆన్‌ లైన్‌ బ్యాంకింగ్‌ ఇలా ఒకటేమిటి ఆన్ లైన్ వేదికగా జరిపే ఏ లావాదేవీకైనా పాస్‌ వర్డ్ ఉండాల్సిందే. అయితే ఆ పాస్ వర్డ్ లను తేలిగ్గా గుర్తుంచుకునేలా కొందరు పెడుతుంటారు. ఎక్కువ అకౌంట్లు ఉండడంతో గుర్తుంచుకోవడం కష్టమని సులభమైన పాస్ వర్డ్ లను కొందరు పెడుతుండగా, మరికొందరు తేలిగ్గా ఉండే పాస్ వర్డ్ ల వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే ఈ పాస్ వర్డ్ లను వాటిపై అవగాహన ఉన్న వారు సులభంగా తస్కరించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాస్ వర్డ్ లపై ‘స్ప్లాష్‌ డేటా’ అనే ఆన్‌ లైన్‌ సంస్థ సర్వే నిర్వహించింది. సైబర్‌ నేరాలు పెరిగిపోడానికి పరమచెత్త పాస్‌ వర్డ్సే కారణమని తేల్చిచెప్పింది. ఈ క్రమంలో అకౌంట్ ఏదైనా అస్సలు పెట్టకూడని ‘బ్యాడ్‌ పాస్‌ వర్డ్స్‌’లో టాప్ టెన్ గురించి వెల్లడించింది. దాని వివరాల్లోకి వెళ్తే…

 • ‘123456’ అనే పాస్ వర్డ్ ప్రపంచంలోనే అత్యంత చెత్త పాస్‌ వర్డ్‌ అని తెలిపింది. చాలా మంది దీనిని పాస్ వర్డ్ గా వినియోగిస్తున్నారని తెలిపింది.
 • రెండో అతిచెత్త పాస్‌ వర్డ్‌ గా ‘పి.ఎ.ఎస్‌.ఎస్‌.డబ్ల్యు.ఒ.ఆర్‌.డి’ పాస్‌ వర్డ్‌ అనే పదాన్ని పాస్ వర్డ్ గా పెట్టేవారు చాలా మంది ఉంటారని, అందువల్లే ఇది రెండో అతిపెద్ద చెత్తపాస్ వర్డ్ గా గుర్తింపు పొందిందని ఆ సంస్థ తెలిపింది.
 • ఇక మూడో చెత్త పాస్ వర్డ్ గా ‘12345678’ ను వినియోగించేవారు కూడా భారీ సంఖ్యలో ఉన్నారని ఆ సంస్థ పేర్కొంది.
 • నాలుగో చెత్త పాస్ వర్డగా కీబోర్డులో వరుసగా ఉండే qwerty అక్షరాలను వాడుతున్నారని తెలుస్తోంది.
 • ఐదో స్థానంలో ‘12345’ పాస్ వర్డ్ నిలిచింది.
 • ఆరో స్థానంలో ‘123456789’ పాస్ వర్డ్ సంపాదించుకుంది.
 • ఏడో స్ధానంలో వాట్ ఎవర్ నిలిచింది.
 • ఎనిమిదో స్థానాన్ని ‘1234567’ దక్కించుకుంది.
 • తొమ్మిదవ స్థానంలో ‘111111’ తొమ్మిదో స్థానంలో నిలిచింది.
 • పదవ స్థానంలో ‘డ్రాగన్‌’ పదం నిలిచింది.

ఈ పాస్ వర్డ్ లను విరివిగా ఉపయోగించడం వల్ల సైబర్ దాడుల బారిన ఎక్కువ మంది పడుతున్నారని స్ప్లాష్ డేటా వెల్లడించింది. పాస్ వర్డ్ లు పెట్టుకునేటప్పుడు స్పెషల్ క్యారెక్టర్లు, నెంబర్లు, పదాలు వినియోగిస్తే సైబర్ దాడుల బారినపడే ప్రమాదం తప్పుతుందని సూచించింది.

Tags: worst password ever list,dragon,keyboard

Related posts

Leave a Comment