‘తొలిప్రేమ’ సెకండాఫ్ ఒక రేంజ్ లో ఆకట్టుకుంటుందట!

tholi prema movie review and rating
  • రేపు విడుదలవుతోన్న ‘తొలిప్రేమ’
  • వరుణ్ – రాశి ఖన్నా కాంబినేషన్ పై క్రేజ్
  • యూత్ కి కనెక్ట్ అయ్యే కంటెంట్
tholi prema movie review and rating
tholi prema movie review and rating

వెంకీ అట్లూరి దర్శకత్వంలో వరుణ్ తేజ్ ‘తొలిప్రేమ’ సినిమా చేశాడు. రాశి ఖన్నా కథానాయికగా నటించిన ఈ సినిమా, రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా షూటింగులో ఎక్కువభాగం విదేశాల్లోనే జరిగింది. దాదాపు 16 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా, లాభసాటిగానే ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకుందట. ‘తొలిప్రేమ’ అనే టైటిలే ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ.

యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో ఆదిత్యగా వరుణ్ తేజ్, వర్షగా రాశి ఖన్నా కనిపించనున్నారు. ఈ ఇద్దరి మధ్యగల కెమిస్ట్రీ యూత్ ను ఒక రేంజ్ లో ఆకట్టుకుంటుందని అంటున్నారు. ట్రైన్ జర్నీ సీన్ .. యూకే నేపథ్యంలో చిత్రీకరించిన సాంగ్ హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు. సెకండాఫ్ లోనే కథ మరింత బలపడుతుందనీ .. అప్పుడు వచ్చే సన్నివేశాలు ఆడియన్స్ ను కట్టిపడేస్తాయనే టాక్ వినిపిస్తోంది. ‘తొలిప్రేమ’ టైటిల్ తో వరుణ్ తేజ్ కూడా హిట్ కొడతాడేమో చూడాలి.

Related posts

Leave a Comment