టాలీవుడ్‌ త్రిమూర్తులలో ఎవరిది పై చేయి?

This Summer Fight Betwwen Three Heroes

ఈ వేసవిలో తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి మూడు భారీ సినిమాలు వస్తున్నాయి. రామ్‌ చరణ్‌ చిత్రం రంగస్థలం ముందుగా వేసవి సీజన్‌కి ఓపెనింగ్‌ బాధ్యతలు తీసుకుంది. ఆ తర్వాత మహేష్‌ నటిస్తున్న భరత్‌ అనే నేను, అల్లు అర్జున్‌ సినిమా నా పేరు సూర్య విడుదలవుతాయి. తెలుగు సినిమా టాప్‌ స్టార్లలో ఈ ముగ్గురిదీ చెక్కు చెదరని స్థానం. అందుకే ఈ వేసవి పోటీ రసవత్తరంగా మారింది.

ఈ సినిమాల మధ్య క్లాష్‌ వుండదు కానీ మూడిట్లో ఏది బాగా ఫేర్‌ చేస్తుందనే దానిపై మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ మూడు చిత్రాల ప్రమోషన్‌ యాక్టివిటీస్‌ కూడా మూడు రోజుల వ్యవధిలో మొదలు కావడం విశేషం. ఈరోజు రంగస్థలం టీజర్‌ రిలీజ్‌ అవుతుంది. రేపు నా పేరు సూర్య చిత్రం ఫస్ట్‌ సింగిల్‌ రిలీజ్‌ చేస్తున్నారు. ఎల్లుండి భరత్‌ అనే నేను ఫస్ట్‌ లుక్‌ వస్తోంది. రేపు బాక్సాఫీస్‌ వద్ద ఈ చిత్రాల్లో ఏది పెద్ద హిట్‌ అవుతుందనేది అటుంచితే ఇప్పుడీ ప్రమోషన్‌ యాక్టివిటీస్‌లో ఎవరు ఎక్కువగా ఆకర్షిస్తారు, ఎవరి చిత్రానికి ఎక్కువ బజ్‌ వస్తుందనేది సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌ అయింది.

ముగ్గురు హీరోల అభిమానులు కూడా ఈ చిత్రాలని ట్రెండ్‌ చేయడం కోసం పట్టుబట్టి మరీ సోషల్‌ మీడియాలో హంగామా తీవ్రతరం చేసారు. మరి ఈ త్రిమూర్తులలో ఎవరిది పైచేయి సాధిస్తుందనేది చూడాలిక.

Related posts

Leave a Comment