కిడారి ఫ్యామిలీకి రూ. 42 లక్షలు, సోమ కుటుంబానికి రూ. 12 లక్షలు!

అరకు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ గా ఉన్న కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు దారుణంగా హత్య చేసిన నేపథ్యంలో, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆయన కుటుంబానికి రూ. 42 లక్షల పరిహారం అందనుంది. గవర్నమెంట్ కు పింపిన నివేదికలో అధికారులు ఈ ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం, మృతిచెందిన ఎమ్మెల్యేల కుటుంబంలో డిగ్రీ చదివిన వారసులు ఉంటే, వారికి డిప్యూటీ కలెక్టర్‌ హోదాతో కూడిన ఉద్యోగాలను గతంలో ప్రభుత్వం ఇవ్వగా, అదే విధానం కిడారి కుటుంబానికీ వర్తిస్తుందని అధికారులు వెల్లడించారు. మాజీ ఎమ్మెల్యేలు నక్సల్స్ చేతిలో మరణిస్తే, ఇచ్చే పరిహారంపై ఎలాంటి విధివిధానాలూ లేనందున మావోల చేతిలో పౌరులు చనిపోతే ఎంతమేర పరిహారం చెల్లిస్తారో అంతే… అంటే రూ. 12 లక్షల వరకూ సోమ కుటుంబానికి అందనుంది.
Tags: kidaari, ap govt,naksals

Related posts

Leave a Comment