ఏపీ ప్రభుత్వం ఉదాసీన వైఖరి వల్లే వారి ప్రాణాలు పోయాయి: ‘జనసేన’

అరకు నియోజకవర్గం పరిధిలో ఉన్న గూడ గ్రామంలో అక్రమంగా సాగుతున్న క్వారీ వ్యవహారాలపై రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో స్పందించి ఉంటే ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమ ప్రాణాలు పోగొట్టుకొనేవారు కాదని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ (ప్యాక్) అభిప్రాయపడింది. సర్వేశ్వర రావు, సోమల మృతికి సంతాపం తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించింది. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్ళిన సందర్భంలో గూడ గ్రామస్తుల విజ్ణప్తి మేరకు అక్కడికి వెళ్ళిన విషయాన్ని ఈ సందర్భంగా ప్యాక్ గుర్తు చేసింది. అక్కడి క్వారీ తవ్వకాల మూలంగా తాగునీటి వనరులు కలుషితమైన తీరుని అక్కడి గ్రామస్తులే పవన్ కల్యాణ్ కి చూపించిన విషయాన్ని, తమ ఇళ్ళు దెబ్బతింటున్న విషయాన్ని, తాముపడుతున్న ఇబ్బందులనీ తెలియజేయడాన్ని ప్యాక్ గుర్తు చేసింది. అలాగే,…

readMore