బయట సిగరెట్ తాగుతూ కనిపిస్తే బుక్కయినట్టే…

  •  హైదరాబాద్ లో 25 మంది అరెస్ట్!
  • బహిరంగ ప్రదేశాలలో ధూమపానం నిషిద్ధం
  • ఇటీవలి కాలంలో తొలిసారిగా ధూమపాన డ్రైవ్
  • వీడియో సాక్ష్యాలతో బుక్ చేసిన పోలీసులు

‘బహిరంగ ప్రదేశాలలో ధూమపానం నిషిద్ధం’… అని ఎంతగా మొత్తుకుంటున్నా, సిగరెట్ తాగుతూ కనిపించే వారు కోకొల్లలు. ఇంతకాలం వారిని చూసీ చూడనట్టు వదిలేసిన హైదరాబాద్ పోలీసులు, ఇక డ్రంకెన్ డ్రైవ్ తో సమానంగా బహిరంగ ధూమపాన డ్రైవ్ ను చేపట్టాలని నిర్ణయించారు.

ఇటీవలి కాలంలో ఈ తరహా డ్రైవ్ తొలిసారి జరుగగా, దాదాపు 25 మంది యువకులు సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయారు. వీరందరూ బహిరంగంగా ధూమపానం చేస్తున్నట్టు వీడియో సాక్ష్యాలను సిద్ధం చేసుకుని, అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారిని నేడు కోర్టు ముందు హాజరు పరచనున్నట్టు తెలిపారు. హబీబ్ నగర్ ప్రాంతంలో ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టామని, ఇకపై ప్రతి ప్రాంతంలోనూ ఇదే తరహా సోదాలు నిర్వహిస్తామని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.

Related posts

Leave a Comment