సమంతను కట్ చేసి పనిలో పడ్డారట

sam-ramcharan-rangastalam-movie-latest-teaser

రంగస్థలం టీజర్ చుసిన తరువాత అందరు చాలా బావుంది అని సోషల్ మీడియా ద్వారా కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఆ తరువాత.. అవును సమంత సినిమాలో హీరోయిన్ కదా..ఎక్కడా అనే ప్రశ్నలు చాలా మంది వేశారు. సెలబ్రెటీలు అడగకపోయినా.. అభిమానులు మాత్రం సినిమా యూనిట్ ని రోజు సోషల్ మీడియా అడిగేస్తున్నారు. ఎందుకంటే సినిమాలో సమంత ఎప్పుడు కనిపించని క్యారెక్టర్ తో కనిపిస్తుందని లీకైన ఫొటోల ద్వారా అందరు తెలుసుకున్న విషయం తెలిసిందే.

దీంతో ఎలాగైనా సమంత ను మరో టీజర్ లో చూపించాలని చిత్ర యూనిట్ కు అభిమానుల నుంచి ఒత్తిడి పెరుగుతోందట. దీంతో దర్శకుడు సుకుమార్ సమంత క్యారెక్టర్ కోసం ఒక స్పెషల్ టీజర్ ని కట్ చేసే పనిలో పడ్డాడట. సినిమాలో ఒక పేదింటి అమ్మాయిలా నాలుగు బర్లను మేపుతూ.. కట్టెల పొయ్యి దగ్గర పొగ మధ్యలో వంట చేస్తున్నట్లు గత ఫోటోలలో కనిపించింది. అప్పుడే సమంత క్యారెక్టర్ ఇంత కొత్తగా ఉందా అని అభిమానులు కనెక్ట్ అయ్యారు. దీంతో దర్శకుడు మరికొన్ని రోజుల్లో రిలీజ్ చేయాలనీ చిత్ర బృందంతో చర్చలు జరుపుతున్నాడట. అయితే ముందుగా చిత్రీకరణకు సంబందించిన సీన్స్ అన్ని ముగించి పోస్ట్ ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టిన తరువాతే టీజర్ రిలీజ్ ఉంటుందట.

ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం అయితే వచ్చే నెల ప్రేమికుల రోజు రామ్ చరణ్ – సమంతకు సంబందించిన లవ్ షాట్స్ ని చూపిస్తారని తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని సమంత క్యారెక్టర్ గురించి మాత్రం తప్పకుండా ఒక టీజర్ ఉంటుందని సమాచారం.

Tags: rangasthalam movie, teaser,movie poster,sai dharam teja,comments on 1985,sam charector,samantha

 

Related posts

Leave a Comment