గ్లామర్ కు విడాకులు ఇచ్చేసిందా?

టాలీవుడ్ బ్యూటీ రాశి ఖన్నా.. కెరీర్ ప్రారంభం నుంచి గ్లామర్ క్యారెక్టర్లతోనే ఆకట్టుకుంది. మధ్యమధ్యలో పక్కింటమ్మాయి పాత్రలు పోషించినా.. ఎక్కువగా మాత్రం గ్లామరస్ గానే మురిపించింది. ఇందుకోసం తన బాడీ సైజులను తగ్గించుకునేందుకు బాగానే కష్టపడింది కూడా. అయితే.. చాలాకాలంగా ఇలాంటి గ్లామర్ రోల్స్ చేస్తున్నా ఈమెకు ఆశించిన స్థాయిలో ఒక్క బ్లాక్ బస్టర్ కూడా పడలేదు. అవకాశాలు వరుసగా వస్తున్నా.. కెరీర్ ను సెట్ చేయగల సినిమా ఏదీ రాలేదు. చాలా రోజులు బికినీలు వేసి గ్లామరసం ఇరగపోసినా కూడా రాని హిట్టు.. గ్లామర్ కు ఆమడ దూరంలో నిలిచిన వరుణ్ తేజ్ మూవీ తొలిప్రేమతో వచ్చింది. అందుకే ఇప్పుడు ఇదే ట్రెండ్ ను కంటిన్యూ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది రాశి ఖన్నా. ఇప్పుడు నితిన్ తో కలసి నటిస్తున్న శ్రీనివాస్ కళ్యాణం సినిమాలో కూడా అలాగే కనిపిస్తున్నట్లుంది రాశి. ఇలా సడెన్ గా చూస్తే ''గ్లామర్ కు విడాకులు ఇచ్చేసిందా??'' అనిపించక మానదు కానీ.. కాకపోతే ఈ డైవోర్స్ మాత్రం ఆన్ స్క్రీన్ వరకే పరిమితం చేసే అవకాశాలు ఉన్నాయి. రకరకాల ఈవెంట్స్ లోను.. అలాగే ఓపెనింగ్స్ లోను.. సోషల్ మీడియాలోను.. గ్లామర్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కావడం లేదు ఈ బ్యూటీ. ఇకపై తన ఎక్స్ పోజింగ్ అండ్ డ్రెసింగ్ విషయంలో పర్ఫెక్ట్ రూట్ నే ఎంచుకుందేమో అనిపించక మానదు. గ్లామర్ బేస్డ్ గా వచ్చిన ఇమేజ్ గ్లామర్ ఉన్నంత వరకే ఉంటుంది. కానీ ట్యాలెంట్ తో కుదురుకుంటే మాత్రం.. ఆ ఇమేజ్ శాశ్వతం అనే విషయం బాగానే గ్రహించింది రాశి.

టాలీవుడ్ బ్యూటీ రాశి ఖన్నా.. కెరీర్ ప్రారంభం నుంచి గ్లామర్ క్యారెక్టర్లతోనే ఆకట్టుకుంది. మధ్యమధ్యలో పక్కింటమ్మాయి పాత్రలు పోషించినా.. ఎక్కువగా మాత్రం గ్లామరస్ గానే మురిపించింది. ఇందుకోసం తన బాడీ సైజులను తగ్గించుకునేందుకు బాగానే కష్టపడింది కూడా.

అయితే.. చాలాకాలంగా ఇలాంటి గ్లామర్ రోల్స్ చేస్తున్నా ఈమెకు ఆశించిన స్థాయిలో ఒక్క బ్లాక్ బస్టర్ కూడా పడలేదు. అవకాశాలు వరుసగా వస్తున్నా.. కెరీర్ ను సెట్ చేయగల సినిమా ఏదీ రాలేదు. చాలా రోజులు బికినీలు వేసి గ్లామరసం ఇరగపోసినా కూడా రాని హిట్టు.. గ్లామర్ కు ఆమడ దూరంలో నిలిచిన వరుణ్ తేజ్ మూవీ తొలిప్రేమతో వచ్చింది. అందుకే ఇప్పుడు ఇదే ట్రెండ్ ను కంటిన్యూ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది రాశి ఖన్నా. ఇప్పుడు నితిన్ తో కలసి నటిస్తున్న శ్రీనివాస్ కళ్యాణం సినిమాలో కూడా అలాగే కనిపిస్తున్నట్లుంది రాశి.

ఇలా సడెన్ గా చూస్తే ”గ్లామర్ కు విడాకులు ఇచ్చేసిందా??” అనిపించక మానదు కానీ.. కాకపోతే ఈ డైవోర్స్ మాత్రం ఆన్ స్క్రీన్ వరకే పరిమితం చేసే అవకాశాలు ఉన్నాయి. రకరకాల ఈవెంట్స్ లోను.. అలాగే ఓపెనింగ్స్ లోను.. సోషల్ మీడియాలోను.. గ్లామర్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కావడం లేదు ఈ బ్యూటీ. ఇకపై తన ఎక్స్ పోజింగ్ అండ్ డ్రెసింగ్ విషయంలో  పర్ఫెక్ట్ రూట్ నే ఎంచుకుందేమో అనిపించక మానదు. గ్లామర్ బేస్డ్ గా వచ్చిన ఇమేజ్ గ్లామర్ ఉన్నంత వరకే ఉంటుంది. కానీ ట్యాలెంట్ తో కుదురుకుంటే మాత్రం.. ఆ ఇమేజ్ శాశ్వతం అనే విషయం బాగానే గ్రహించింది రాశి.

Tags: rasi kanna,glamour role,hit movie

Related posts

Leave a Comment