కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్‌పై రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు

‘మరో ప్రార్థనా మందిరాన్ని కూలగొట్టిన చోట రామాలయాన్ని నిర్మించాలని అసలైన హిందువు కోరుకోడు’ అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బీజేపీ మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసలు శశిథరూర్ డీఎన్ఏ హిందువులది కాదని పేర్కొన్నారు. అందుకనే ఆయన రామ మందిరంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన డీఎన్ఏలో బాబర్ డీఎన్ఏ ఉన్నట్టు అనిపిస్తోందన్నారు. థరూర్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక పార్టీగా మరోమారు నిరూపితమైందని పేర్కొన్న రాజాసింగ్.. కాంగ్రెస్ అధిష్ఠానమే శశిథరూర్‌తో ఇలా మాట్లాడిస్తోందని ఆరోపించారు.
Tags: raajasingh , ramalayam,shashidarur

Related posts

Leave a Comment