కత్తి మహేష్ పై పరువు నష్టం దావా వేస్తాం: పూనం కౌర్ సోదరుడు ప్రకటన

poonam kapoor brother serious warning to kathi mahesh
  • పూనంకు చేనేతపై పూర్తి అవగాహన ఉంది
  • ఆమెకు ఏ దర్శకుడితోనూ విభేదాలు లేవు
  • కత్తి మహేష్ ఆరోపణలు అవాస్తవం
  • పూనం కౌర్ సోదరుడు శ్యాంసింగ్ స్పష్టీకరణ

నటుడు పవన్ కల్యాణ్, సినీ విమర్శకుడు కత్తి మహేష్ మధ్య మొదలైన వివాదం ఓ మలుపు తీసుకుని… పూనం కౌర్, కత్తి మహేష్ మధ్య రాజుకున్న విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ కు మద్దతుగా, కత్తి మహేష్ ను ఫ్యాట్సో, బెగ్గర్ అని వ్యాఖ్యానిస్తూ పూనం కౌర్ ట్వీట్ చేయడంతో గొడవ పెద్దదైపోయింది. ఈ నేపథ్యంలో పూనం కౌర్ కు ఇవే తన ప్రశ్నలంటూ ఓ ఆరింటిని కత్తి మహేష్ సంధించారు. వీటికి పూనం కౌర్ సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

వీటికి పూనం ఇంకా స్పందించలేదు. కానీ, ఆమె సోదరుడు శ్యాంసింగ్ మాత్రం స్పందించారు. కత్తి మహేష్ చేసిన ఆరోపణలు అవాస్తవమని పేర్కొన్నారు. దర్శకుడు ‘త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే మీకు ఎందుకు అంత కోపం’ అన్నది కత్తి మహేష్ సంధించిన ప్రశ్నల్లో ఒకటి. అయితే, పూనం కౌర్ కు ఏ దర్శకుడితోనూ విభేదాలు లేవని శ్యాంసింగ్ తేల్చేశారు.

‘ఎవరు రికమెండ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ చేనేత అంబాసిడర్ పదవి వచ్చింది?’ అన్నది మహేష్ మరో ప్రశ్న. నీట్ లో చదివిన పూనంకు చేనేతపై పూర్తి అవగాహన ఉందని శ్యాంసింగ్ చెప్పారు. తమ సోదరి పూనం కౌర్ ను అవమానించిన కత్తి మహేష్ పై పురువు నష్టం దావా వేస్తామని తెలిపారు.

Tags: Kathi Mahesh vs pawan kalyan,poonam kapoor,shyam singh

Related posts

Leave a Comment