ట్రిపుల్ తలాక్ ముస్లింలకే కాదు.. హిందూ పురుషులు కూడా..: ప్రధాని మోదీ హెచ్చరిక

Pm Modi sensational, comments, on ripple, talak
  •  జైలుకెళ్తారు!: ప్రధాని మోదీ హెచ్చరిక
  • ట్రిపుల్ తలాక్‌పై రాజ్యసభలో వాడివేడి చర్చ
  • విపక్షాలపై విరుచుకుపడిన ప్రధాని మోదీ
  • బిల్లును ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని డిమాండ్

ట్రిపుల్ తలాక్ బిల్లుపై బుధవారం రాజ్యసభలో జరిగిన బిల్లుపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ కాంగ్రెస్, మిత్రపక్షాలపై విరుచుకుపడ్డారు. ‘ట్రిపుల్ తలాక్’ బిల్లు ఏ ఒక్క కమ్యూనిటీనో ఉద్దేశించినది కాదని, ఇదే నేరం కింద హిందూ పురుషులను కూడా జైలుకు పంపుతామని హెచ్చరించారు. బిల్లు ఆలస్యానికి కాంగ్రెస్సే కారణమని నిందించారు. కాంగ్రెస్ నేతలు ప్రతీదానిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని, ‘స్వచ్ఛ భారత్’, ‘మేక్ ఇన్ ఇండియా’, ‘సర్జికల్ స్ట్రైక్స్, ‘యోగా డే’.. ఇలా అన్నింటికీ అడ్డంకులు సృష్టించడమే కాంగ్రెస్ పనని దుమ్మెత్తి పోశారు.

వాటిని విమర్శించే స్వేచ్ఛ వారికి ఉందని, అయితే ‘ట్రిపుల్ తలాక్’ బిల్లుకు రాజ్యంగ హోదా దక్కకుండా ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని ప్రధాని డిమాండ్ చేశారు. బిల్లుపై నిర్మాణాత్మక చర్చకు తాము సిద్ధమని పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఆరోగ్య కార్యక్రమం ‘ఆయుష్మాన్ భవత్’పై అన్ని పార్టీల సలహాలు, సూచనలు కావాలని కోరారు.

Tags: Pm Modi sensational, comments, on ripple, talak

Related posts

Leave a Comment