బీజేపీతో ఇంకో పార్టీ గాయ‌బ్‌..

PDP BJP Alliance Break Up

జమ్ముకశ్మీర్లో మ‌ళ్లీ రాజ‌కీయ ప్ర‌కంప‌న‌లు మొద‌లయ్యాయి. పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ (పీడీపీ) బీజేపీ మ‌ద్ద‌తుతో అక్క‌డ ప్ర‌భుత్వం ఏర్పాటుచేసింది. అయితే, బీజేపీ ఈరోజు పీడీపీకి మ‌ద్ద‌తు ఉప‌సంహ‌రిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. దీంతో, ముఫ్తీ ప్రభుత్వం మైనార్టీలోకి పడిపోయింది. వెంట‌నే ముఖ్య‌మంత్రి మెహబూబా రాజీనామా చేస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. చూస్తుంటే  రాష్ట్రప‌తి పాల‌న దిశ‌గా అడుగులు ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది.

ఎందుకిలా జ‌రిగింది… కాశ్మీర్లో గ‌త కొంత‌కాలం క్రితం బీజేపీ చెందిన వ్య‌క్తులు చిన్నారి రేప్ కేసు నిందితులకు మ‌ద్ద‌తు ప‌ల‌క‌డంతో అప్ప‌ట్లో మెహ‌బూబాకు ఇబ్బంది క‌రంగా మారింది. అనంత‌రం మ‌రో సంఘ‌ట‌న‌లో రైజింగ్ కాశ్మీర్ సంపాదకులు సుజాత్ బుఖారీ హత్య జ‌రిగింది. తర్వాత ఆర్మీ రైఫిల్‌మెన్ ఔరంగజేబును ఉగ్రవాదులు హత్య చేశారు. దీంతో  భార‌త‌సైన్యం ఉగ్ర‌వాదుల వేట మొద‌లుపెట్టింది. కాల్పుల విర‌మ‌ణ ఒప్పందం ఉల్లంఘించొద్ద‌ని మెహ‌బూబా కోరారు. అయితే, రంజాన్ త‌ర్వాత ఇది కొన‌సాగుతుందని కేంద్రం తెలిపింది. దీంతో మెహబూబా ఆగ్ర‌హంగా ఉన్నారు. రాజ‌కీయంగా ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌నే కార‌ణంతో మెహబూబా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు.

రానున్న సాధార‌ణ ఎన్నిక‌ల నేప‌థ్యంలో కాశ్మీర్ సెంటిమెంటు మిస్స‌వుతుంద‌న్న కార‌ణంతోనే బీజేపీ పీడీపీకి దూర‌మైంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. దీనిని మ‌జ్లిస్ నేత అస‌దుద్దీన్ ఒవైసీ కూడా దేశ‌భ‌క్తి విష‌యం బీజేపీని త‌ప్పు ప‌ట్టారంటే… బీజేపీ ప‌రిస్థితి ఎంత దాకా వ‌చ్చిందో అర్థ‌మ‌వుతోంది. మేము ముస్లింలే గాని దేశ భ‌ద్ర‌తకు వ‌చ్చేస‌రికి ఇండియ‌న్స్ అని అస‌ద్ వ్యాఖ్యానించిన విష‌యం తెలిసిందే.

Related posts

Leave a Comment