టీటీడీ నగల గురించి సీనియర్ ఐపీఎస్ అధికారి నాకు చెప్పారు: పవన్

Janasena Pawan President Kalyan to resume Vizag tour on June 26

గత కొంత కాలంగా తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి నగలకు సంబంధించి అనేక ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నప్పటికీ క్లారిటీ రావడం లేదు. తెలుగు దేశం పార్టీపై వస్తున్న ఆరోపణలకు ఇప్పటికే ఆ పార్టీ నేతలు ఖండించారు. బీజేపీ కావాలని కుట్రలు పన్నుతోందని కామెంట్స్ చేశారు. ఇకపోతే ఈ విషయంపై ఎవరు ఊహించని విధంగా జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు.

తిరుమల మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు చేస్తున్న ఆరోపణలు తనకు ఆశ్చర్య కలిగించలేదని చెప్పిన పవన్ స్వామివారి మధ్యప్రాచ్య దేశాలకు ఓ ప్రైవేట్ విమానంలో వెళ్లాయని చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంకా ఏమన్నారంటే.. గతంలో ఒకసారి హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ఓ సీనియర్ ఐపీఎస్ అధికారిని కలిశాను. అప్పుడు టీటీడీ నగలపై కొన్ని విషయాలను చెప్పారు. ప్రతిపక్ష నేతలతో పాటు తెలుగు దేశం పార్టీ నేతలకు కూడా ఈ సంగతి తెలుసు. ఐపీఎస్ అధికారి చెప్పిన దాని ప్రకారం… టీటీడీ స్వామివారి నగలు మిడిల్ ఈస్ట్ దేశాలకు ప్రైవేట్ విమానంలో వెళ్లాయి. దీని వల్లే తిరుమల మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ఆరోపణలు చేశారు. ఆ వ్యాఖ్యలకు నాకు ఆశ్చర్యంగా అనిపించలేదు. వెంకటేశ్వర స్వామి మౌనంగా ఉన్నారు.. ఆయన నగలను దొంగిలించవచ్చని దొంగలు అనుకుంటున్నారు అంటూ తనదైన శైలిలో పవన్ ట్వీట్ చేశారు.

Related posts

Leave a Comment