కత్తి-పవన్ అభిమానుల వివాదంలో ఊహించని మలుపు.. పవన్‌కు ఓయూ విద్యార్థుల హెచ్చరిక

warning comments on pawan politics

కత్తి మహేశ్‌కు ఓయూ జేఏసీ మద్దతు
పవన్ తన అభిమానులను అమ్ముకుంటున్నాడన్న కత్తి
‘పవన్ హఠావో.. పాలిటిక్స్ బచావో’ అన్న విద్యార్థులు
సినీ విశ్లేషకుడు కత్తి మహేశ్-పవన్ అభిమానుల మధ్య కొనసాగుతున్న వివాదంలోకి ఉస్మానియా విద్యార్థులు ఎంటరయ్యారు. ఎవరూ ఊహించని విధంగా విద్యార్థులు ఆయనకు మద్దతు పలికారు. కత్తి మహేశ్‌పై పవన్ అభిమానులు దాడి చేస్తే పవన్‌ను తెలంగాణలో తిరగనిచ్చేది లేదని హెచ్చరించారు.

గురువారం కత్తి మహేశ్ ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లాడు. ఆయనకు మద్దతుగా పెద్ద ఎత్తున తరలివచ్చిన ఓయూ జేఏసీ విద్యార్థులు ‘పవన్ కల్యాణ్ హఠావో.. పాలిటిక్స్ బచావో’ అంటూ నినదించారు. కత్తికి తమ మద్దతు ప్రకటించారు. పవన్ అభిమానులకు, పవన్‌కు హెచ్చరికలు జారీ చేశారు. మహేశ్‌పై దాడి జరిగినట్టు తెలిస్తే పవన్‌ను తెలంగాణలో తిరగనివ్వబోమని హెచ్చరించారు.

కత్తి మహేశ్ మాట్లాడుతూ..పవన్ తన అభిమానులను వేరే పార్టీలకు అమ్ముకుంటున్నాడని ఆరోపించాడు. అభిమానులను తనపైకి ఉసిగొల్పుతున్నాడని అన్నాడు. ఇప్పటికైనా తన అభిమానులను అదుపులో పెట్టుకోవాలని సూచించాడు.

Related posts

Leave a Comment