“ఆపరేషన్ గరుడ” సృష్టికర్త ప్రత్యేకహోదా కోసం పూజలు చేసాడంట.!

operation garuda shrutikartha sivaji

ఆ మధ్య ఆపరేషన్ గరుడ అంటూ పెద్ద స్థాయిలో కుట్రలు జరగబోతాయని ముం,దే జ్యోతిష్యం చెప్పి సంచలనాన్ని రేపేసి నటుడు శివాజీ నవ్వులపాలు అయ్యిన సంగతి తెలిసినదే.దానిపై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా ఎదుర్కొన్నారు.అది చాలదన్నట్టుగా మళ్ళీ ఈ మధ్యనే గరుడ ఆపరేషన్ మళ్ళీ మొదలయిందని,తనకి చంద్రబాబు నాయుడుకి ప్రాణ హాని ఉందని మళ్ళీ తెర మీదకు వచ్చాడు శివాజీ.ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా రావాలని,ఆ వెంకన్న స్వామిని కోరుకున్నానని తెలియజేసారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అందరూ సుభిక్షంగా ఉండాలని,ఆపరేషన్ గరుడలోని భాగంగా ఎవరి పాత్రలను వారు బాగానే పోషిస్తున్నారని,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇంకా ప్రాణహాని తొలగిపోలేదని,వారు ఇంకా ప్రమాదంలోనే ఉందని మళ్ళీ సంచలన వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రంలో కొంత మంది నాయకులు నీచమైన మనస్తత్వంతో అభివృద్ధిని ఆపాలని చూస్తున్నారని,వారు చంద్రబాబుని తొక్కేయాలని చూస్తున్నారని,బాబు గారే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఆయన ఆరోగ్యం ఎప్పుడు బాగుండాలని కూడా ఆ దేవుణ్ణి మొక్కుకున్నాని తెలిపారు.
Tags: operation garuda ,shrutikartha sivaji ,special status

Related posts

Leave a Comment