హీరో చరణ్.. ఎన్టీఆర్ గెస్ట్ రోల్?

ntr and ramcharan multi starrer movie

నిన్న రాత్రి నుంచి తెలుగు ప్రేక్షకులే కాదు.. ఇతర భాషలకు చెందిన వాళ్లు కూడా రాజమౌళి తర్వాతి సినిమా గురించే చర్చించుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్.. రామ్ చరణ్ కాంబినేషన్లో తాను మల్టీస్టారర్ తీయబోతున్నట్లుగా రాజమౌళి ఒక ఫొటో ద్వారా సంకేతాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా ఎలా ఉంటుంది.. ఎన్టీఆర్, చరణ్ పాత్రలు ఎలా ఉంటాయి.. ఎవరికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటాయి. ఇద్దరు హీరోల పాత్రల్ని ఎలా బ్యాలెన్స్ చేస్తూ అభిమానుల్ని రాజమౌళి ఎలా సంతృప్తి పరుస్తాడు అనే చర్చలు మొదలయ్యాయి. ఐతే ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇది నిఖార్సయిన మల్టీస్టారర్ కాదట.

ramcharan and ntr

రాజమౌళి సినిమాలో రామ్ చరణే హీరో అట. ఎన్టీఆర్‌ది అతిథి పాత్ర అలట. కానీ ఆ ఆ పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుందని.. ఇంటెన్్‌గా ఉండే ఆ రోల్ కథను మలుపు తిప్పేలా ఉంటుందని.. పవర్‌ఫుల్‌గా దాన్ని తీర్చిదిద్దుతున్నారని అంటున్నారు. రామ్ చరణ్‌ను రాజమౌళి కుడివైపు కూర్చోబెట్టి.. ఎన్టీఆర్‌ను ఎడమవైపు కూర్చోబెట్టుకోవడం కూడా పాత్రలకు సంబంధించి ఒక సూచికే అంటున్నారు. ఇదొక సోషల్ డ్రామా అని.. కమర్షియల్ హంగులకు లోటు ఉండదని చెబుతున్నారు. 2018 మధ్యలో సినిమా మొదలవుతుందని.. డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తారని.. ఈలోపే చరణ్ బోయపాటి శ్రీను సినిమాను పూర్తి చేస్తాడని.. ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తూనే ఈ చిత్రానికి డేట్లు కేటాయిస్తాడని అంటున్నారు. మరి ఇందులో ఎంత వరకు నిజముందో చూడాలి.

Related posts

Leave a Comment