మద్రాసు హైకోర్టులో క్షమాపణలు చెప్పిన స్వామి నిత్యానంద

nithya nanda apolasise to madras high court
  • మదురై ఆధీనం మఠం 293వ పీఠాధిపతిగా ప్రకటించుకున్న స్వామి నిత్యానంద
  • మద్రాసు హైకోర్టులో క్షమాపణలు
  • తాను చేసిన ప్రకటన ఉపసంహరించుకుంటానని అఫిడవిట్ దాఖలు

మదురై ఆధీనం మఠం 293వ పీఠాధిపతిగా తాను చేసిన ప్రకటన తప్పేనని వివాదాస్పద స్వామీజీ నిత్యానంద మద్రాసు హైకోర్టుకు క్షమాపణలు చెప్పారు. గతంలో 293వ పీఠాధిపతినంటూ తాను చేసిన ప్రకటనను ఉపసంహరించుకుంటున్నానని తెలుపుతూ మద్రాసు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. దాని వివరాల్లోకి వెళ్తే… మదురై ఆధీన 293వ పీఠాధిపతిగా నిత్యానంద తనకు తాను ప్రకటించుకున్నారు. దానిని సవాలు చేస్తూ జగదల ప్రతాపన్‌ అనే ప్రముఖుడు మద్రాసు హైకోర్టు, మదురై బెంచ్‌ లో పిటిషన్‌ వేశారు. 292వ పీఠాధిపతి జీవించి ఉండగా, తాను పీఠాధిపతినని స్వామి నిత్యానంద ఎలా ప్రకటించుకుంటారని ఆయన పిటిషన్ లో ప్రశ్నించారు. ఒక పీఠాధిపతి జీవించి ఉండగా, ఆ మఠం ఉత్తరాధికారిగా ప్రకటించుకునే వెసులుబాటు లేదని, అన్ని అధికారాలు 292వ పీఠాధిపతికే ఉన్నాయని తెలపాలని ఆయన సదరు పిటిషన్‌ లో కోరారు. దీనిని విచారించిన న్యాయస్థానం దీనిపై సమాధానం చెప్పాలని నిత్యానందకు నోటీసులు జారీ చేయగా, కౌంటర్ అఫిడవిట్ లో న్యాయస్థానానికి నిత్యానంద క్షమాపణలు చెప్పారు. అనంతరం ఈ కేసులో తదుపరి విచారణను ఈ నెల 26వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది.

Tags: nithyananda,apologise,madura, high court

Related posts

Leave a Comment