టాలీవుడ్ లో ‘నంది’ పాలిటిక్స్..గొడవ మొదలైంది..!

nandi award politics in tollywood

నంది అవార్డ్స్ తో మరో మారు టాలీవుడ్ కళకళ లాడుతోంది. ఏపీ ప్రభుత్వం ఒకేసారి మూడు సంవత్సరాలకి గాను నంది అవార్డు విజేతల్ని ప్రకటించింది. ఉత్తమ నటులుగా బాలకృష్ణ, మహేష్ బాబు మరియు ఎన్టీఆర్ లు ఎంపికయ్యారు. ముఖ్యంగా నందమూరి ఇంట నందుల పంట పండింది. ఎన్టీఆర్ బాలయ్యలు ఉత్తమ నటులుగా సత్తా చాటారు. మరో వైపు హరికృష్ణ మనవళ్లు(జానకి రామ్ కుమారులు) దానవీర సూర కర్ణ చిత్రానికి ఉత్తమ చైల్డ్ ఆర్టిస్టులుగా ఎంపికయ్యారు. శ్రీమంతుడిగా మహేష్ పెర్ఫామెన్స్ ఫిదా అయిన జ్యురి మెంబర్స్ 2015 సంవత్సరం ఉత్తమ నటుడిగా ఎంపిక చేసారు.

ఇక రాజమౌళి ఖాతాలో కూడా రెండు నందులు చేరాయి. బి ఎన్ రెడ్డి జాతీయ అవార్డు రాజమౌళికి దక్కగా, బాహుబలి ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. కాగా మెగా క్యాంప్ మరియు అక్కినేని క్యాంప్ కు అవార్డుల ఎంపికలో అన్యాయం జరిగిందనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. క్లాసిక్ అనదగ్గ రీతిలో రూపొందించిన ‘మనం’ చిత్రం కేవలం ద్వితీయ ఉత్తమ చిత్రంగా సరిపెట్టారు. ఇక మెగా క్యాంప్ లో చిరంజీవికి రఘుపతి వెంకయ్య అవార్డు మినహా మరే ఊసు కనిపించలేదు. రుద్రమ దేవి చిత్రానికి గాను స్పెషల్ రోల్ లో మెరిసిన బన్నీకి బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా అవార్డు దక్కింది.

మొత్తంగా సోషల్ మీడియాలో, సినీ అభిమానుల్లో జరుగుతున్నా చర్చ ఏంటంటే.. అవార్డుల ఎంపికలో పసుపు హావ సాగినట్లు చర్చించుకుంటున్నారు. నందమూరి, బోయపాటి, రాజమౌళి ఇలా చంద్రబాబు సన్నిహితులకు పెద్ద పీట వేశారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Tags: nandi awards 2017,legend,balakrishna,manam,mahes babu,award politics,ap govt

Related posts

Leave a Comment