చారిత్రక నాగోబా ఆలయాన్ని కూల్చివేయనున్న గ్రామస్తులు..పునర్నిర్మాణానికి ఏర్పాట్లు పూర్తి!

naagobha temple renovation

naagobha temple renovation

ఇంద్రవెల్లి మండలం కేశ్లాపూర్ గ్రామంలో ఉన్న నాగోబా ఆలయం
శాంతిపూజలు నిర్వహిస్తున్న గోండు పెద్దలు, పూజారులు
పాత ఆలయం స్థానే నూతన ఆలయం నిర్మించనున్న మెశ్రం వంశస్తులు
ఆదిలాబాద్ జిల్లాలోని చారిత్రక నాగోబా ఆలయ పునర్నిర్మాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇంద్రవెల్లి మండలం కేశ్లాపూర్ గ్రామంలో ఉన్న ఈ ఆలయాన్ని మరి కాసేపట్లో గ్రామస్తులు కూల్చివేయనున్నారు. పాత నాగోబా ఆలయం స్థానే నూతన ఆలయాన్ని నిర్మించేందుకు, ఆలయ నిర్వాహకులైన మెశ్రం వంశస్తులు సిద్ధమయ్యాయరు. ఈ నేపథ్యంలో గోండు పెద్దలు, పూజారులు శాంతిపూజలు నిర్వహిస్తున్నారు.

కాగా, నూతన ఆలయ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం నిధులిచ్చేందుకు ముందుకొచ్చినా మెశ్రం వంశస్థులు సున్నితంగా తిరస్కరించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి నిధులు తీసుకుంటే ఆ శాఖ ప్రభావం తమ సంస్కృతీ సంప్రదాయాలపై పడుతుందని, అందుకే తిరస్కరించామని ఆ వంశస్థులు చెప్పడం గమనార్హం. వంశస్తుల నుంచి విరాళాల రూపేణా సేకరించిన కోటిరూపాయలతో విశాలమైన నూతన ఆలయాన్ని అదే స్థలంలో నిర్మించనున్నారు.

Related posts

Leave a Comment