ఎంపీ కవిత ఉద్యమానికి మహేశ్‌బాబు మద్దతు

IKEA store, location, hyderabad,furnichers

రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా రాఖీ పండుగ రోజున సోదరులకు శిరస్త్రాణం బహుమతిగా ఇవ్వాలంటూ ఎంపీ కల్వకుంట్ల కవిత సామాజిక మాధ్యమాల ద్వారా చేపట్టిన ప్రచారోద్యమానికి సినీనటుడు మహేశ్‌బాబు మద్దతు తెలిపారు. గురువారం తన పుట్టినరోజు సందర్భంగా ఈ మేరకు వీడియో సందేశాన్ని ఆయన విడుదల చేశారు. రాష్ట్రంలోని ప్రతి సోదరీ తమ సోదరులకు ఒక శిరస్త్రాణాన్ని అందజేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల వల్ల రోజుకు దేశంలో 28 మంది చనిపోతున్నారని, ఆ కుటుంబాలు ప్రేమించే మనుషులను కోల్పోతున్నాయని వాపోయారు. ఎంపీ కవిత చేపట్టిన సిస్టర్‌ ఫర్‌ చేంజ్‌ ఉద్యమం మార్పునకు నాంది కావాలన్నారు. రక్షాబంధన్‌ రోజు రాఖీ కట్టిన అన్నదమ్ములకు శిరస్త్రాణాన్ని అందజేయడంతో పాటు దానిని తప్పకుండా ధరించాలని చెప్పండి… ఒక జీవితాన్ని కాపాడితే కుటుంబాన్ని కాపాడినట్లేనని మహేశ్‌బాబు పేర్కొన్నారు. శిరస్త్రాణంపై వీడియో సందేశం ఇవ్వడంపై ఎంపీ కవిత ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
Tags: mp kavitha, udhyamaniki, mahesh babu ,madhathu, rakhi festival

Related posts

Leave a Comment