పారిస్ లో ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో దోపిడీ.. రూ.38,66,69,250 విలువజేసే వజ్రాభరణాలు చోరీ!

Paris,5 star hotel,ridge 5star hotel robbery, diamonds

పారిస్‌లో కలకలం
దుండగుల కాల్పుల్లో ఒకరికి గాయాలు
ముగ్గురిని పట్టుకున్న పోలీసులు
ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లోకి చొరబడిన దుండగులు ఏకంగా రూ.38,66,69,250 విలువజేసే వజ్రాభరణాలను చోరీ చేసిన ఘటన పారిస్‌లో కలకలం రేపింది. నిన్న సాయంత్రం ఆరున్నర గంటలకు దుండగులు రిడ్జ్‌ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లోకి చొరబడి కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో హోటల్‌ సిబ్బంది ఒకరు గాయపడ్డారు.

దొంగలు ప్రవేశించారన్న భయంతో అందరూ కిచెన్‌లో దాక్కుని ఉండిపోయారు. హోటల్‌ లోని ప్రముఖ ఆభరణాల షోరూం డిస్ప్లేలను పగులగొట్టిన దొంగలు ఆభరణాలను సంచుల్లోకి కూరుకుని ఉడాయించారు. పోలీసులు అక్కడకు చేరుకునేలోపే దొంగలు మాయమయ్యారు. అయితే, చట్టుపక్కల ప్రాంతంలో పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న పోలీసులు ముగ్గురు దొంగలను ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.
Paris,5 star hotel,ridge 5star hotel robbery, diamonds,

Related posts

Leave a Comment