సిద్ధ రామయ్య జేబులో నిమ్మకాయపై మోదీ వ్యంగ్యాస్త్రాలు!

modi comments about by lemon on siddaramayya

modi comments about by lemon on siddaramayya
సిద్ధ రామయ్య తన కారుపై కాకి వాలిందని ఆ కారు మార్చారు
మూఢనమ్మకాలు పాటిస్తున్నారు
అలాంటి పనుల వల్ల మైండ్ సెట్ మారదు
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. సీఎం సిద్ధరామయ్యపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నిన్న హుబ్లీలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న మోదీ.. సిద్ధరామయ్య జేబులో నిమ్మకాయ ఉంచుకోవడంపై సెటైర్లు వేశారు. కర్ణాటక అభివృద్ధిపై హామీలు గుప్పించిన సిద్ధరామయ్య మూఢనమ్మకాలు పాటిస్తున్నారని విమర్శించారు. సిద్ధరామయ్య తన కారుపై కాకి వాలిందని ఆ కారును మార్చారని..అలాంటి పనులు చేయడం వల్ల మైండ్ సెట్ మారదని అన్నారు.

ఈ సందర్భంగా సోనియా, రాహుల్ గాంధీలపై ఆయన విరుచుకుపడ్డారు. రూ.5 వేల కోట్ల రూపాయల కుంభకోణం కేసులో తల్లీకొడుకులు బెయిల్ పై బయట ఉన్నారని, ఈ విషయం మర్చిపోయిన కాంగ్రెస్ నేతలు తమను ప్రశ్నిస్తున్నారంటూ మోదీ విరుచుకుపడ్డారు. కాగా, నేడు కర్ణాటక ఎన్నికల ప్రచారంలో యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. భాల్కి, హుమ్నాబాద్, ఖానాపూర్, బెల్గావ్ లలో ఆయన పర్యటిస్తారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ రేపు కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.

Related posts

Leave a Comment