వంగవీటి రాధాను తప్పించడానికి నేను కారణం కాదు!: మల్లాది విష్ణు

తన కారణంగానే విజయవాడ సెంట్రల్ సీటును వైసీపీ అధినేత జగన్ వంగవీటి రాధాకు నిరాకరించారని వస్తున్న వార్తల్లో నిజం లేదని మల్లాది విష్ణు తెలిపారు. పార్టీ నేతలందరినీ కలుపుకుని పోయి పార్టీ విజయం కోసం కృషి చేస్తానని తెలిపారు. ‘గడప గడపకు వైఎస్సార్ సీపీ’ కార్యక్రమంలో భాగంగా జగన్ ప్రకటించిన నవరత్నాలు పథకాలను ప్రజల్లోకి తీసుకెళతామన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పార్టీ బాధ్యతలు అప్పగించిన జగన్ కు మల్లాది విష్ణు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.

Related posts

Leave a Comment