లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే చాలు!

lord maha lakshmi images

జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురవుతుంటాయి .. మరెన్నో సమస్యలు చుట్టుముడుతుంటాయి. అలాంటివాటిని ఎదుర్కోవడానికి మానసికంగా బలంగా ఉండటం అవసరమే అయినా, డబ్బు కూడా కావలసిందే. డబ్బు అవసరాలను తీర్చడమే కాదు .. ఆపదల నుంచి గట్టెక్కించడమే కాదు .. ఆత్మాభిమానాన్ని కాపాడుతూ ఉంటుంది కూడా. గౌరవ మర్యాదలు వున్నవారు సైతం ఓ పది రూపాయల అప్పుడు అడిగితే చాలు .. లోకువైపోతుండటం చూస్తుంటాం.

అందువలన డబ్బు విషయంలో చాలామంది చాలా జాగ్రత్తగా ఉంటూ వుంటారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ డబ్బు రావడం .. అది నిలవడం లక్ష్మీదేవి అనుగ్రహం పైనే ఆధారపడి ఉంటాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అనునిత్యం లక్ష్మీదేవి సన్నిధిలో దీపారాధన చేయడం వలన .. ఆ తల్లి అష్టోత్తరం గానీ .. సహస్ర నామాలు గాని పఠించడం వలన అమ్మవారి అనుగ్రహం కలుగుతుందట. లక్ష్మీదేవి నామస్మరణ వలన దారిద్య్రం తొలగిపోవడమే కాకుండా, శారీరకపరమైన .. మానసిక పరమైన బాధలు కూడా తొలగిపోతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.

Tags: lord maha lakshmi images,maha lakshmi pooja,

Related posts

Leave a Comment