నేను ప‌ప్పును కానంటున్న కేటీఆర్‌

తెలంగాణ‌లో అధికార‌, ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య ఆస‌క్తిక‌ర‌మైన సంవాదం జ‌రుగుతోంది. స్విట్జర్లాండ్ దావోస్‌లోని ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశానికి మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం అందలేదని, రిజిస్ట్రేషన్ చేసుకొని వెళ్లారంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసిన ఆరోపణలపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమశాఖల మంత్రి కే తారక రామారావు ఘాటుగా స్పందించారు. ఏకంగా ట్విట్ట‌ర్ వేదిక‌గా త‌న టూర్‌కు అందిన వివ‌రాల‌ను పోస్ట్ చేశారు. ఈ సంద‌ర్భంగా ప‌రోక్షంగా రాహుల్‌గాంధీని ముగ్గులోకి లాగారు.

ప్రపంచ ఆర్థిక వేదిక ఆహ్వానం మేరకే తాను సమావేశానికి వెళ్లానని కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఈ- ఇన్విటేషన్, ఈ- మెయిల్ కాపీలను మంత్రి ట్విట్టర్‌లో బహిరంగపర్చారు. `మేధో దివాళాకోరుతనానికి ప్రతీక అయిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నాకు ఆహ్వానం అందలేదని ఆరోపిస్తున్నారు. ఆయన కోసం ఈ ఆహ్వానం కాపీలను బహిరంగ పరుస్తున్నాను` అని కేటీఆర్ ట్వీట్ చేశారు. `ఉత్తమ్ గారూ.. నేను పప్పును కాదు. ఇప్పటికైనా మిమ్మల్ని మీరు హుందాగా కరెక్ట్ చేసుకుంటారని ఆశిస్తున్నా` అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
Tags: ktr,tpcc,uttam kumar reddy,rahul gandhi,dawoos,

Related posts

Leave a Comment