అనంత జనసేన కార్యకర్తల ఒత్తిడి..ఓకే చెప్పిన పవన్..!

janasena important announcement from anantapur

జనసేనాని నివృత్తి చేయాల్సిన చాలా ప్రశ్నలు ఇంకా అలాగే ఉన్నాయి. ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉంది. ఇటువంటి తరుణంలో పవన్ ఇంకా మౌనంగానే ఉంటె పార్టీకి చాలా నష్టం జరుగుతుంది. రాజకీయ పార్టీ అంటే విమర్శలు చేసే వారి నోటు వెంటనే మూయించాలి. ప్రత్యర్థులు చేసే విమర్శలని తట్టుకోవాలి. కానీ జనసేనకు సంస్థాగత నిర్మాణం లేకపోవడంతో అవేమీ జరగడం లేదు. ఎన్నికల బరిలోకి దిగుతునప్పుడు మొదట సిద్ధం కావాల్సింది అధినేతే. కానీ పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయంలోనే ఇంకా క్లారిటీ రాలేదు. ఆ మధ్యన అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తానని మాత్రం జనసేనాని ప్రకటించారు.

జనసేన వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం పవన్ మౌనానికి ఫుల్ స్టాప్ పడే టైం దగ్గర పడిందని చెబుతున్నారు. జనసేన పార్టీ నిర్మాణంలో పాన్ కళ్యాణ్ ఎంత స్పీడుగా అడుగులు వేస్తున్నారో తెలియదు కానీ, ఆయన అభిమానులు మాత్రం యమా స్పీడు మీద ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడెప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారా అని ఎదురుచూస్తున్నారు. అనంతపురం జనసేన అభిమానులే దీనికి ఉదాహరణ.

ఏపీలో తొలి జనసేన పార్టీ కార్యాలయం అంతలోనే మొదలవ్వాలని ఆ పార్టీకి చెందిన స్థానిక నేతలు, అభిమానులు కొందరు గుత్తి సమీపంలో రెండెకరాల భూమిని లీజుకు తీసుకున్నారట. పవన్ కళ్యాణ్ అనంతలో పర్యటించిన వెంటనే ఆయన చేతపార్టీ ఆఫీస్ నిర్మాణానికి శంకుస్థాపన చేయించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ విషయాన్ని అనుచరుల ద్వారా తెలుసుకున్న పవన్ త్వరలోనే అనంతలో పర్యటించేందుకు ఏర్పాట్లు చెయవలసిందిగా పార్టీని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఆ సందర్భంలోనే తాను పోటీ చేయబోయే నియోజకవర్గాన్ని కూడా ప్రకటించడానికి పవన్ రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Related posts

Leave a Comment