ఏపీ వ్యాప్తంగా సోదాలు… టీడీపీకి సన్నిహితంగా ఉన్న బడా వ్యాపారవేత్తలే ఐటీ టార్గెట్!

it departments raides in andhrapradesh
  • తీవ్ర కలకలం రేపుతున్న ఐటీ దాడులు
  • పలు చోట్ల ప్రారంభమైన రైడ్స్
  • రియల్ ఎస్టేట్ వ్యాపారులే టార్గెట్

ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో ఈ ఉదయం నుంచి ప్రారంభమైన ఆదాయపు పన్ను శాఖ దాడులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఉదయం నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, తూర్పు గోదావరి, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లోని పలు చోట్ల అధికారులు దాడులు ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీకి సన్నిహితంగా ఉన్న బడా వ్యాపారవేత్తలే ఐటీ శాఖ లక్ష్యంగా తెలుస్తోంది.

గత రెండు మూడేళ్లుగా భారీ ఎత్తున నిర్మాణ రంగ లావాదేవీలు జరిపిన వ్యక్తులు, నాలుగేళ్లకు ముందు నగర శివార్లలో పొలాలను కొనుగోలు చేసి, వాటిని ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్న వారే ఈ ఐటీ దాడుల్లో ప్రధాన టార్గెట్ గా ఉన్నారని సమాచారం. ముఖ్యంగా అమరావతి చుట్టుపక్కల 50 కిలోమీటర్ల పరిధిలో 50 ఎకరాలకు మించి కొనుగోలు చేసిన వ్యక్తులకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలను ఇప్పటికే సేకరించిన అధికారులు, ఆయా లావాదేవీల గుట్టు రట్టు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.
Tags: it departments,raides andhrapradesh,business, politicians

Related posts

Leave a Comment