పద్దతిగా ట్యాక్స్ కట్టమ్మా పాపాయ్

Income tax trouble for Priyanka Chopra

ఇండియా నుంచి హాలీవుడ్‌కు ఎగుమ‌తైన హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రా. షార్ట్ క‌ట్లో ముద్దుగా పీసీ అని పిలుచుకుంటాం. బాలీవుడ్‌, హాలీవుడ్ ప్రాజెక్టుల‌తో రెండు చేతులా సంపాదిస్తోంది… అయినా స‌రే ప‌ద్ద‌తి ట్యాక్స్ క‌ట్ట‌డానికి మాత్రం తెగ క‌ష్ట‌ప‌డుతోంది.

ఈ హీరోయిన్ ప‌లు కంపెనీల‌కు అంబాసిడ‌ర్‌గా ప‌నిచేసింది. ప‌ని కాలం పూర్తయ్యాక కొన్ని కంపెనీలు బ‌హుమ‌తిగా విలువైన వ‌స్తువులు అందించాయి ప్రియాంక‌చోప్రాకు. ఎల్వీఎంహెచ్ ట్యాగ్ కంపెనీ వారు 40లక్షల రూపాయలు విలువచేసే వాచ్‌ను ఇచ్చారు. అలాగే టొయేటా వారేమో 27 ల‌క్ష‌ల రూపాయ‌లు విలువ చేస కారును గిఫ్ట్ గా ఇవ్వ‌గా, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నుంచి 17.06లక్షల ఖ‌రీదు చేసే నెక్లెస్‌, ఒక భవనం బ‌హుమ‌తులుగా ఇచ్చారు. ఇవ‌న్నీ ఇచ్చింది ఇప్పుడు కాదు ఆరేడేళ్ల క్రితం.

2011లో చేసిన ఐటీ దాడుల్లో ఈ ఖరీదైన బ‌హుమ‌తుల‌కు ఎలాంటి ర‌శీదులు చూప‌లేక‌పోయింది పీసీ. వాటిని ఆదాయంలో కూడా చూప‌లేదు. వాటిని బ‌హుమ‌తులుగా చూపింది. ఆ వ‌స్తువుల‌కు ఎలాంటి ప‌న్ను క‌ట్ట‌లేదు. దీంతో ప‌న్ను క‌ట్టాల్సిందిగా అప్ప‌ట్లోనే అధికారులు పీసీని కోరారు. ఆమె మాత్రం అవి బ‌హుమ‌తులు కాబ‌ట్టి ప‌న్నునుంచి మిన‌హాయించాల‌ని కోరుతూ క‌మిష‌న‌ర్‌ను ఆశ్ర‌యించింది. ఆయ‌న కూడా ప‌న్ను క‌ట్టాల్సిందేన‌ని తేల్చారు. దీంతో ఇన్‌కంటాక్స్ ట్రైబ్యున‌ల్‌ను పిటిష‌న్ వేసింది. అక్క‌డ కూడా అమ్మ‌డికి క‌లిసి రాలేదు.

ఆదాయపు పన్ను సెక్షన్ 28(4) ప్రకారం కాస్ట్‌లీ బహుమతులకు పన్ను కట్టాల్సిందేనని వారు స్పష్టంగా చెప్పారు. పాపం పీసీ ప‌న్ను ఎగ్గొట్ట‌డానికి ఎంత ప్ర‌య‌త్నించిందో… కానీ స‌ఫలం కాలేదు అంటూ ఇప్పుడు నెట్టింట్లో జోకులు పేలుతున్నాయి. కోట్లలో సంపాదిస్తున్నావుగా.. పద్దతిగా పన్ను కట్టేయ్ పాపాయ్ అంటున్నారు.

Tags: Priyanka chopra,gst,income tax,Hollywood project,LVMH tag,wrist watch,redchilli,

Related posts

Leave a Comment