అలాంటప్పుడు నేను హీరోలతో డేటింగ్ కు ఎలా వెళ్తాను?: శ్రియ

Shriya Saran latest controversal news
  • హీరోలకి అద్దం చూడడానికే సగం సమయం సరిపోతుంది
  • మిగిలిన సగం సమయం నేను అద్దం చూస్తాను
  • ఇక హీరోలతో డేటింగ్, లవ్ ఎలా సాధ్యం?

సినీ పరిశ్రమలో ఎవరితోనైనా డేటింగ్‌కి వెళ్లారా? అని తనను ప్రశ్నిస్తుంటారని సినీ నటి శ్రియ అసహనం వ్యక్తం చేసింది. డేటింగ్‌ కి వెళ్లాలంటే ఎదుటివ్యక్తిపైన ప్రేమ ఉండాలని చెప్పింది. నిజంగా ప్రేమలో పడ్డవారు ఒక్క మాటైనా మాట్లాడుకోకపోయినా రోజంతా ఒకరినొకరు చూసుకుంటూ గడిపేయగలరని చెప్పింది. ‘ఇక హీరోలతో నా డేటింగ్ విషయానికి వస్తే… హీరోలకు రోజులో సగం సమయం అద్దం ముందు చూసుకోవడానికే సరిపోతుంది. మిగిలిన సగం సమయంలో నేను అద్దం చూసుకుంటూ గడిపేస్తాను. ఇక మా మధ్య ప్రేమ ఎలా పుడుతుంది? డేటింగ్‌కి ఎవరితో వెళ్లాలి?’ అని శ్రియ ప్రశ్నించింది.

అయినా ప్రేమించడం అంత తేలిక కాదని పేర్కొంది. ఈ ప్రపంచంలో అత్యంత క్లిష్టమైన విషయం ప్రేమలో పడటం అని, కానీ అందరూ అత్యంత సులువుగా ‘లవ్‌’ అనే పదాన్ని వాడేయడం ఆశ్చర్యంగా అనిపిస్తుందని శ్రియ తెలిపింది. తన గురించి చాలా గాసిప్స్ రాస్తుంటారని, అవన్నీ నిజాలు కావని శ్రియ చెప్పింది. తనకు ప్రతి అంశం మీద కచ్చితమైన అభిప్రాయం ఉందని, దానిని బట్టే తన ప్రవర్తన ఉంటుందని శ్రియ తెలిపింది. కాగా, ఆమె ప్రస్తుతం ‘గాయత్రి’, ‘వీరభోగవసంతరాయలు’, తమిళంలో ‘నరగాసురన్‌’, హిందీలో ‘తడ్కా’ సినిమాల్లో నటిస్తోంది.

Tags: Dating With Heroes,shreya sharan,love,contravention

Related posts

Leave a Comment