అమ్మమ్మ 4 వేలకు అమ్మేస్తే… ఆ బాలిక రెండేళ్ల పాటు నరకం చూసింది!

girl trafficing in telugu states
  • రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన గిరిజన బాలిక
  • బాలిక బాధ్యతలు తీసుకున్న అమ్మమ్మ
  • 4,000 రూపాయలకు ఢిల్లీకి చెందిన వ్యక్తికి విక్రయం

తల్లిదండ్రులను కోల్పోయిన ఓ బాలికను ఆమె అమ్మమ్మ 4,000 రూపాయలకు విక్రయిస్తే, రెండేళ్లపాటు బాలిక నరకం చూసిన ఘటన దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. దాని వివరాల్లోకి వెళ్తే… జార్ఖండ్‌ లోని గొడ్డా జిల్లాకు చెందిన బాలిక (15) రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయింది. దీంతో బాలిక బాధ్యతలను వాళ్ల అమ్మమ్మ తీసుకుంది.

అనంతరం ఆమెను ఢిల్లీకి చెందిన సురేందర్‌ అనే వ్యక్తికి 4,000 రూపాయలకు విక్రయించింది. సురేందర్‌ ఇంట్లో అడుగుపెట్టిన తొలిరోజే ఆమె అత్యాచారానికి గురైంది. ఆ తరువాత ఆమెను తన స్నేహితుడు మణిమిశ్రా వద్ద పనికి పెట్టాడు. మిశ్రా ఆమెపై తొలిరోజు నుంచే లైంగిక దాడికి పాల్పడ్డాడు. కాళ్లను కట్టేసి, సిగరెట్లతో కాల్చి రెండేళ్లపాటు నరకం చూపించాడు. వారి బారినుంచి తప్పించుకున్న బాలిక ఫరీదాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, బాలికను చికిత్స నిమిత్తం బీటీ ఆసుపత్రికి తరలించి, దర్యాప్తు ప్రారంభించారు.

Related posts

Leave a Comment