ఏపీకి ఇచ్చిన నిధులు ‘బాహుబలి’ కలెక్షన్ల కంటే తక్కువగా ఉన్నాయి: గల్లా జయదేవ్ ఫైర్‌

Galla Jayadev Speech On Budget 2018 Demands NDA Govt Funds To AP
  • ఎన్నికల నేపథ్యంలో బెంగళూరు మెట్రోకి నిధులు కేటాయించారు
  • విభజన చట్టంలో విశాఖకి రైల్వే జోన్ అంశం ఉన్నప్పటికీ ఎందుకు ఇవ్వలేదు
  • చంద్రబాబు 29 సార్లు ఢిల్లీలో పెద్దలను కలిశారు

విభజన చట్టంలోని 19 అంశాలను అమలు చేయాల్సి ఉందిపార్ల‌మెంటులో టీడీపీ ఎంపీల నిర‌స‌న కొన‌సాగుతోన్న సంగ‌తి తెలిసిందే. విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం ఏపీకి ఇచ్చిన హామీలు నెర‌వేర్చాల‌ని,ప్ర‌త్యేక ప్యాకేజీ నిధుల గురించి ప్ర‌క‌ట‌న చేయాల‌ని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజు పార్ల‌మెంటులో నిరసన వ్యక్తం చేసిన టీడీపీ ఎంపీలకు స్పీకర్ మాట్లాడే అవకాశం ఇచ్చారు. దీంతో, టీడీపీ ఎంపీ గ‌ల్లా జ‌యదేవ్ ….పార్ల‌మెంటు సాక్షిగా మిత్ర‌ప‌క్షం బీజేపీపై షాకింగ్ కామెంట్స్ చేశారు. విభజన చ‌ట్టం ప్ర‌కారం హామీలు నెరవేర్చకుంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి కష్టాలు త‌ప్ప‌వ‌ని హెచ్చరించారు. త్వ‌రలో జ‌ర‌గ‌బోతోన్న క‌ర్ణాట‌క ఎన్నిక‌ల నేప‌థ్యంలోనే బెంగుళూరు మెట్రోకు నిధులిచ్చార‌ని దుయ్య‌బ‌ట్టారు.

విభజన చట్టంలోని 19 అంశాల్లో ఒక్కటీ అమలు కాలేద‌ని, క‌నీసం రెండేళ్ల క్రితం ప్ర‌క‌టించిన ప్ర‌త్యేక‌ ప్యాకేజీ గురించి ప‌ట్టించుకున్న‌వారు లేర‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఏపీ ప్ర‌జ‌ల‌ను ఎల్ల‌కాలం మోసం చేయలేర‌ని, ఆంధ్ర ప్రజలు ఫూల్స్ కార‌ని షాకింగ్ కామెంట్స్ చేశారు. సీఎం చంద్రబాబు 40 సార్లు కేంద్రంలోని పెద్దలను కలిసినా ఫ‌లితం లేద‌న్నారు. మిత్ర పక్ష‌నికి క‌నీస విలువ ఇవ్వ‌డం లేద‌న్నారు. కాంగ్రెస్ లాగే బీజేపీ స్వార్థ పూరిత రాజ‌కీయాలు చేస్తే….ఏపీ ప్ర‌జ‌లు చూస్తూ ఊరుకోర‌ని, వారు అమాయ‌కులు కార‌ని హెచ్చరించారు. ప్రత్యేక ప్యాకేజీ గురించి వెంటనే ప్రకటన చేయాలని గల్లా డిమాండ్ చేశారు. ఏపీకి కేంద్రం ఇచ్చిన‌ నిధులకంటే `బాహుబలి` కలెక్షన్లే ఎక్కువగా ఉన్నాయని ప్రజలు జోక్ లు వేసుకుంటున్నార‌ని ఎద్దేవా చేశారు. జ‌య‌దేవ్ సెటైర్ల‌తో ఒక్క‌సారిగా సభలో నవ్వులు విరిశాయి. మ‌రోవైపు, కేంద్రం వైఖ‌రికి నిర‌స‌న‌గా ఏపీలోని ప్ర‌తిప‌క్ష పార్టీలు రేపు ఏపీ బంద్ కు పిలుపునిచ్చిన నేప‌థ్యంలో….తాము కూడా రేపు రాష్ట్ర‌ వ్యాప్త నిర‌స‌న‌లు చేప‌డ‌తామ‌ని అధికార టీడీపీ ప్ర‌క‌టించింది. రేపు మండల, నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు చేయాల‌ని నిర్ణ‌యించుకున్నామ‌ని ఏపీ మంత్రి క‌ళా వెంక‌ట్రావు మీడియాకు తెలిపారు. ఢిల్లీలో టీడీపీ ఎంపీల పోరాటానికి మ‌ద్ద‌తుగా ఈ ప్ర‌ద‌ర్శ‌న‌లు చేయ‌నున్న‌ట్లు తెలిపారు.
Tags: AP Govt, BJP, Chandrababu Naidu, Galla Jayadev

Related posts

Leave a Comment