ఒక పిల్లాడిని కాపాడబోతే.. ఆరుగురు చిన్నారుల ప్రాణాలు పోయాయి!

fatal accident in bihar
  • రోడ్డుకు అడ్డంగా వచ్చిన పిల్లాడు
  • తప్పించే ప్రయత్నం చేసిన డ్రైవర్
  • అదుపుతప్పి చెరువులో పడిపోయిన కారు

అటూఇటూ వస్తున్న వాహనాలను చూసుకోకుండా రోడ్డు దాటేందుకు యత్నిస్తున్న ఓ పిల్లాడిని కాపాడేందుకు డ్రైవర్ చేసిన ప్రయత్నం… చివరకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆరుగురు చిన్నారుల ప్రాణాలను బలిగొంది. బీహార్ లోని అరారియా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం… ప్రమాదానికి గురైన స్కార్పియో వాహనంలో చిన్నారులతో పాటు నలుగురు పెద్దలు ఉన్నారు. దబ్రా గ్రామం సమీపంలోకి రాగానే… ఓ పిల్లాడు రోడ్డుకు అడ్డంగా వచ్చాడు. అతన్ని తప్పించేందుకు డ్రైవర్ ప్రయత్నించాడు. దీంతో రోడ్డు పక్కనే ఉన్న చెట్టును వాహనం ఢీకొని, పక్కనే ఉన్న చెరువులోకి పడిపోయింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఆరుగురు పిల్లలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

Related posts

Leave a Comment