తన తండ్రికి బర్త్ డే శుభాకాంక్షలు కేటీఆర్, కవిత ఇలా తెలిపారు!

cm kcr birthday wishes 2018
  • కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా విషెస్ చెప్పిన కేటీఆర్, కవిత
  • ఓ కవిత రాసిన కేటీఆర్
  • మీ కూతురిగా పుట్టడం అదృష్టమన్న కవిత

తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా తనయుడు కేటీఆర్, కూతురు కవిత ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పారు.‘హ్యాపీ బర్త్ డే డ్యాడ్.. మంచి ఆరోగ్యం, సంతోషంతో ఉండాలని కోరుకుంటున్నా’ అని తన ట్వీట్ లో పేర్కొన్న కేటీఆర్, తన తండ్రిపై ఓ అద్భుతమైన కవితను పోస్ట్ చేశారు. కవిత తన ట్వీట్ లో ఏమన్నారంటే ..‘డియర్ ఫాదర్!! మీ అడుగుజాడల్లో నడుస్తున్నందుకు గర్వపడుతున్నా & మీ కూతురిగా పుట్టడం నా అదృష్టం’ అని పేర్కొన్న కవిత, తన తండ్రి ఫొటోను పోస్ట్ చేశారు. కాగా, ప్రముఖ మాటల రచయిత పరుచూరి గోపాలకృష్ణ, ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కూడా కేసీఆర్ కు తమ శుభాకాంక్షలు తెలిపారు.

Related posts

Leave a Comment