చరణ్-ఉపాసనల్ని చిరు గెంటేస్తానన్నాడట

Chiru Sweet Warning To Ram Charan Upasana

Chiru Sweet Warning To Ram Charan Upasana

రామ్ చరణ్.. అతడి భార్య ఉపాసనలను మెగాస్టార్ చిరంజీవి ఇంటి నుంచి బయటికి పంపించేస్తానని హెచ్చరించాడట. ఐతే ఇది సీరియస్ వార్నింగ్ కాదు.. స్వీట్ వార్నింగ్ అంటున్నాడు రామ్ చరణ్. ఇంతకీ చిరు ఇలా వార్నింగ్ ఇవ్వడానికి కారణమేంటో తెలుసా..? చరణ్-ఉపాసనల జంతు ప్రేమ. వీళ్లిద్దరికీ జంతువులంటే చాలా ఇష్టమన్న సంగతి తెలిసిందే.ఐతే ఈ ప్రేమతో పరిమితికి మించి ఇంటి ప్రాంగణంలోకి జంతువుల్ని తీసుకొచ్చేస్తున్నారంటూ చిరు అభ్యంతరం వ్యక్తం చేశాడట. ఇంట్లో మనుషుల కంటే జంతువులు ఎక్కువైతే ఇద్దరినీ బయటికి పంపించేస్తా అని చిరు హెచ్చరించాడట. కానీ ఆ మాటను తాము పట్టించుకోలేదని.. నిజంగానే తమ ఇంట్లో మనుషుల కంటే జంతువుల సంఖ్య పెరిగిపోయిందని చరణ్ తెలిపాడు.

తాను.. ఉపాసన చిన్నపిల్లల్ని ఎలా చూసుకుంటామో అలా జంతువుల్ని చూసుకుంటామని చరణ్ తెలిపాడు. అమల నడిపే బ్లూ క్రాస్ క్లబ్బులో జంతువులు ఎక్కువైతే తమ ఇంటికే పంపుతారని.. అలాగే జూలో జంతువుల్ని సరిగా చూడటం లేదని తెలిసి అధికారులు తమ ఇంటికి కొన్ని జంతువుల్ని పంపారని.. అందులో ఒక ఒంటె కూడా ఉందని చరణ్ చెప్పడం విశేషం. ఇలా ఇంట్లో బాగా జంతువులు పెరిగిపోవడంతో వాటి కోసమే ప్రత్యేకంగా ఒక ఫామ్ హౌస్ కట్టాల్సిన పరిస్థితి తలెత్తిందని చరణ్ తెలిపాడు. తమ ఇంట్లో గుర్రాలు చాలా ఉన్నాయని.. అందులో బ్రాట్.. బ్రిట్నీ అనే గుర్రాలంటే తనకెంతో ఇష్టమని.. వాటికి పిల్లలు కూడా పుట్టాయని చరణ్ తెలిపాడు. తాను.. ఉపాసన పెళ్లి రోజు వేరే బహుమతులు కాకుండా జంతువుల్నే గిఫ్టుగా ఇచ్చుకుంటామని చరణ్ చెప్పడం విశేషం.

Related posts

Leave a Comment