అన్యాయం జరిగిందంటుంటే… రొటీన్ సమావేశమనడం ఏమిటి?

chandra babu naidu, fire,sujana choudary,
  •  సుజనా చౌదరిపై చంద్రబాబు ఆగ్రహం!
  • సుజనా చౌదరిది బాధ్యతారాహిత్యం
  • ఎలా పోరాడాలో చర్చించిన సమావేశాన్ని ‘రొటీన్’ అనడమేంటి?
  • నిరసనల్లో పాల్గొనని ఎంపీలంతా ఎక్కడ?
  • అసహనాన్ని వ్యక్తం చేసిన చంద్రబాబు

ఢిల్లీలో సుజనా చౌదరి బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసిన తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇది ఓ రొటీన్ సమావేశమే అన్న అర్థం వచ్చే వ్యాఖ్యలు చేయడంపై అసహనాన్ని వ్యక్తం చేసిన ఆయన, రాష్ట్రానికి అన్యాయం జరిగిందని చెబుతూ, న్యాయం జరిగేందుకు ఎలా పోరాడాలో నిర్ణయించేందుకు సమావేశమైతే, దాన్ని రొటీన్ అని చెప్పడమేంటని చంద్రబాబు ప్రశ్నించారు.

ఓ వైపు ప్రజలు ఆగ్రహంగా ఉన్న వేళ, ఈ తరహా వ్యాఖ్యలతో ఎలాంటి సంకేతాలను పంపాలని అనుకుంటున్నారని అడిగారు. ఇదే సమయంలో పార్లమెంట్ లో ధర్నా చేయాలని తాను ఆదేశిస్తే, ఏడుగురు ఎంపీలే పాల్గొన్నారని గుర్తు చేస్తూ, మిగతావారంతా ఏమయ్యారని చంద్రబాబు మండిపడ్డారు. పార్లమెంటులో స్పష్టమైన హామీ వస్తేనే పోరాటానికి కొంత విరామం ఇవ్వాలని అప్పటివరకూ నిరసనలు కొనసాగించాలని సూచించారు.

Related posts

Leave a Comment