కేంద్ర బడ్జెట్‌ 2018-19 హైలైట్స్‌

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ 2018-19 ఏడాదికిగాను కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఏప్రిల్‌ 1, 2018 నుంచి ప్రారంభంకానున్న ఆర్థిక సంవత్సరానికి ఆయన గురువారం ఉదయం లోక్‌సభలో 11గంటలకు బడ్జెట్‌ను ప్రసంగ పాఠాన్ని మొదలుపెట్టారు. జైట్లీ బడ్జెట్‌ ప్రవేశ పెట్టడం ఇది ఐదోసారి. ఎన్డీయే సర్కార్‌కు ఇది పూర్తిస్థాయి ఆఖరి బడ్జెట్‌. 2019లో సాధారణ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఈ బడ్జెట్‌ కేంద్రానికి అతిముఖ్యమైనది కాగా ఇదే ఏడాది ఎనిమిది రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ బడ్జెట్‌కు ప్రాధాన్యం సంతరించుకుంది. మరోపక్క, కేంద్రం జీఎస్‌టీని గత ఏడాది అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత వస్తున్న తొలి బడ్జెట్‌ కూడా ఇదే. ఈ నేపథ్యంలో ఆ బడ్జెట్‌లోని ప్రధాన అంశాలు మీ కోసం..

కేంద్ర బడ్జెట్‌ 2018-19 హైలైట్స్‌

హెల్త్‌ సెక్టార్‌

 • టీబీ పేషెంట్ల సరంక్షణకు రూ.670 కోట్లతో ప్రత్యేక నిధి
 • ఇప్పటికే ఉన్న జిల్లా ఆస్పత్రులను మెడికల్‌ కాలేజీలుగా అభివృద్ధి
 • కొత్తగా 24 మెడికల్‌ కాలేజీలకు అనుమతి
 • ప్రతి మూడు పార్లమెంటరీ స్థానాలకు కలిపి కనీసం ఒక ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఏర్పాటు
 • టీబీ రోగులకు వైద్యం సమయంలో నెలకు రూ.500
 • ఒక్కో కుటుంబానికి రూ.5లక్షల వరకు హెల్త్‌ స్కీం (ఆయుష్మాన్‌ భవ పథకం). రూ.330 చెల్లిస్తే కుటుంబానికి బీమా
 • ఆయుష్మాన్‌ భవ పథకంతో అందరికీ ఆరోగ్యం
 • ప్రపంచంలోనే అతి పెద్ద జాతీయ ఆరోగ్య భద్రతా పథకం.. పది కోట్ల మందికి లబ్ధి

విద్య

 • కొత్తగా 18 ఆర్కిటెక్చర్‌ కాలేజీలు
 • స్కూల్‌ టీచర్ల శిక్షణకు ప్రత్యేక స్కూళ్లు
 • డిజిటల్‌ విద్యావిధానానికి మరింత చేయూత
 • విద్యారంగంలో మౌలిక అభివృద్ధికి రూ.లక్షకోట్లతో రైజ్‌ నిధి
 • విద్యాభివృద్ధి కోసం జిల్లా కేంద్రంగా ప్రణాళిక
 • ఈ ఏడాది నుంచి పీఆర్‌ఎఫ్‌(ప్రధానమంత్రి రిసెర్చ్‌ ఫెలోషిప్‌). టాప్‌ వెయ్యి మంది బీటెక్‌ విద్యార్థులు
 • నాణ్యతతో కూడిన విద్యను అందించేందుకు అన్ని రాష్ట్రాలతో కలిసి మేం పనిచేయనున్నాం.
 • గ్రూప్‌ సీ, డీలలో ఇంటర్వ్యూలను రద్దు చేశాంవ్యవసాయం, గ్రామీణ రంగం, సంక్షేమం
  ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి రూ.లక్షా 5వేల కోట్లు
 • ముద్ర యోజనఫండ్‌కోసం రూ.3లక్షల కోట్లు
 • ఎస్సీ, ఎస్టీల సంక్షేమ నిధికి 50శాతం నిధుల పెంపుగ్రామీణ ప్రాంతంలోని పేదలకు ఉచిత విద్యుత్‌ కోసం రూ.16 వేల కోట్లు
 • వచ్చే ఏడాది కొత్తగా 2కోట్ల మరుగు దొడ్లు నిర్మించి ఇస్తాం
 • కౌలు రైతులకు కూడా రుణాలు ఇచ్చేలా కొత్త విధానం
 • వచ్చే ఏడాది వ్యవసాయ రుణాలకు రూ.11 లక్షల కోట్లు
 • దిగువ తరగతి వారికి ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన కింద 50 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యం
 • ఉజ్వల పథకం కింద 8 కోట్ల ఉచిత గ్యాస్‌ కనెక్షన్లు
 • ప్రధానమంత్రి సౌభాగ్య యోజనకు రూ.1600 కోట్లు
 • సాగునీటి కోసం నాబార్డుతో కలిసి ప్రత్యేక విధానం
 • చేపల పెంపకం, పశుసంవర్థకానికి రూ.10వేల కోట్లు
 • జాలర్లకు క్రెడిట్‌ కార్డులు
 • ఆపరేషన్‌ గ్రీన్‌కు రూ.500 కోట్లు
 • సౌర విద్యుత్‌ను మరింత ప్రోత్సహిస్తాం
 • నేషనల్‌ బ్యాంబూ మెషిన్‌కు రూ.1200 కోట్లు
 • వెదురు పరిశ్రమకు మరింత ఊతం అందించనున్నాం
 • ఆర్గానిక్‌ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాం
 • వ్యవసాయ మార్కెట్‌ల అభివృద్ధికి రూ.2000 కోట్లు
 • ఫుడ్‌ ప్రాసెసింగ్‌కు రూ.1400 కోట్లు
 • ఫుడ్‌ ఫ్రాసెసింగ్‌ కోసం 42 కేంద్రాలు ఏర్పాటు
 • ఆర్గానిక్‌ వ్యవసాయానికి కేంద్రం తోడ్పాటును అందిస్తుంది
 • వ్యవసాయ ఎగుమతులను సరళీకృతం చేస్తున్నాం
 • పెట్టుబడికి ఒకటిన్నర రెట్లు ఉండేలా మద్ధతు ధర నిర్ణయిస్తాం
 • పంట కొనే విషయంలో రాష్ట్రాలతో మాట్లాడి ఓ వ్యవస్థ ఏర్పాటు చేస్తాం
 • ప్రభుత్వం ఇచ్చే ఏ ప్రయోజనం అయినా నేరుగా ప్రజల ఖాతాల్లో వేస్తున్నాం
 • పేద, మధ్యతరగతి వర్గాలు హాయిగా బతికేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేశాం.
 • రైతులు 50శాతం లాభాలు సాధించారు
 • వ్యవసాయ రంగం గణనీయంగా అభివృద్ధి చెందింది
 • ఈ బడ్జెట్‌లో వ్యవసాయంతోపాటు, గ్రామీణరంగం, సంక్షేమ రంగంపై దృష్టి సారించింది.
 • మా ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉంది. రైతుల ఆదాయం పెంచేందుకు దృష్టి సారించాం
 • మోదీ నేతృత్వంలో వ్యవస్థీకృత సంస్కరణలు అమలవుతున్నాయి
 • కొత్త భారత్‌ను మేం ఆవిష్కరిస్తున్నాం
 • జీఎస్టీతో పేదలకు మేలు జరిగింది
 • భారత్‌ 7శాతం వృద్ధిని సాధిస్తుందని ఐఎంఎఫ్‌ వెల్లడించింది.
 • ప్రపంచంలోనే ఏడో పెద్ద ఆర్థిక వ్యవస్థగల దేశంగా భారత్‌ ఉంది.
 • ప్రపంచంలోనే వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్‌ ఉంది
 • మేం అధికారంలోకి వచ్చే నాటికి విధానపరమైన పక్షపాతం ఉంది
 • నాలుగేళ్ల కిందట పారదర్శకత పాలన అందిస్తామని చెప్పాం
 • కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్న అరుణ్‌ జైట్లీ..
 • లోక్‌సభ సమావేశం ప్రారంభం
 • లోక్‌సభ హాల్‌ వద్దకు చేరుకున్న ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌
 • బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్‌
 • కేంద్ర మంత్రిమండలి సమావేశం ప్రారంభం. బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్న కేంద్ర కేబినెట్‌
 • బడ్జెట్‌ ప్రవేశ పెట్టేందుకు పార్లమెంటుకు చేరుకున్న అరుణ్‌ జైట్లీ
 • పార్లమెంటుకు చేరుకున్న బడ్జెట్‌ పత్రాలు.. భద్రతా బలగాల తనిఖీ పూర్తి
 • బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు వెళ్లడానికి ముందు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను మర్యాద పూర్వకంగా కలిసిన అరుణ్‌ జైట్లీ
 • తన ఇంటి నుంచి బడ్జెట్‌ బ్రీఫ్‌ కేసుతో ఆర్థికశాఖ కార్యాలయానికి చేరుకున్న అరుణ్‌జైట్లీ, బడ్జెట్‌ రూపకల్పనా బృందం

Related posts

Leave a Comment