బ్రేకింగ్ న్యూస్… ముమ్మిడివరం మండలంలో గోదావరిలో పడవ బోల్తా

తూర్పు గోదావరి జిల్లాలో ఘటన 19 మందితో వెళుతున్న పడవ సహాయక చర్యలు ప్రారంభం ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గోదావరిలో ఈ ఉదయం ఓ మరపడవ బోల్తా పడింది. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం గుజాపులంక వద్ద ఈ ఘటన జరిగింది. పడవ నదిని దాటుతున్న సమయంలో అందులో 19 మంది వరకూ ఉన్నట్టు తెలుస్తుండగా, కొందరు ఈదుకుంటూ ఒడ్డుకు రాగలిగారని ప్రాథమిక సమాచారం. విషయం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. నదిలో వరద ప్రవాహం అధికంగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఈ ఘటనలో మృతులు ఎవరైనా ఉన్నారా? వారి వివరాలు ఏంటన్న విషయం తెలియాల్సి వుంది.

readMore

బుద్ధి మార్చుకోని పాక్..

వాజ్‌పేయికి నివాళులు అర్పించిన పాక్ మంత్రి జాఫర్ సుష్మా స్వరాజ్‌తో భేటీ చర్చలే కశ్మీర్ సమస్యకు పరిష్కారమని వ్యాఖ్య తనది వంకర బుద్ధేనని పాకిస్థాన్ మరోమారు నిరూపించింది. వాజ్‌‌పేయికి నివాళులు అర్పించేందుకు వచ్చిన పాకిస్థాన్ మంత్రి సయ్యద్ అలీ జాఫర్ ఆ పని మానేసి కశ్మీర్ పల్లవి అందుకున్నారు. వాజ్‌పేయికి నివాళులు అర్పించేందుకు వచ్చిన అలీ మాట్లాడుతూ.. ఆయన రాసిన కవితలను గుర్తు చేస్తూ.. ఆయనో గొప్ప నేత అని కీర్తించారు. వాజ్‌పేయి దూరదృష్టి ఉన్న నేత అని కొనియాడారు. ఉపఖండం నుంచి ఉగ్రవాదాన్ని తరిమికొట్టాలని ఆయన కలలు కన్నారని పేర్కొన్నారు. భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న వివాదాలన్నీ పరిష్కారం కావాలని తాము కోరుకుంటున్నట్టు చెప్పిన ఆయన చర్చల ద్వారానే కశ్మీర్ సమస్య పరిష్కారం అవుతుందన్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగవుతాయని ఆకాంక్షించారు. విదేశాంగ శాఖ మంత్రి…

readMore

ముగిసిన వాజ్ పేయి అంత్యక్రియలు!

చితికి నిప్పంటించిన దత్త పుత్రిక హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు వాజ్ పేయికి కన్నీటీ వీడ్కోలు పలికిన నేతలు మాజీ ప్రధాని వాజ్ పేయి అంత్యక్రియలు ముగిశాయి. ఢిల్లీలోని రాష్ట్రీయ స్మృతి స్థల్ లో వాజ్ పేయి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. మంచి గంధపు చెక్కల చితిపై వాజ్ పేయి పార్ధివ దేహానికి దత్త పుత్రిక నమిత భట్టాచార్య నిప్పంటించారు. హిందూ సంప్రదాయం ప్రకారం వేద పండితులు వాజ్ పేయి అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, బీజేపీ అగ్రనేతలు, అభిమానులు, ఆయన కుటుంబసభ్యులు వాజ్ పేయికి కన్నీటీ వీడ్కోలు పలికారు. వాజ్ పేయి అంతక్రియల్లో రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, బీజేపీ అగ్రనేతలు ఎల్కే అద్వానీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు…

readMore

‘పవనిజం’ అంటే ‘నిజం’.. ఆ నిజానికి ప్రత్యక్షరూపం పవన్ కల్యాణ్!: నాగబాబు

2008, 2009 నుంచి ‘పవనిజం’ ఉంది ఈ మాట ఎందుకొచ్చిందో కల్యాణ్ బాబుకూ తెలియదు నాక్కూడా మొదట్లో తెలిసేది కాదు జనసేన పార్టీ అధినేత, ప్రముఖ హీరో పవన్ కల్యాణ్ ను అభిమానించే అభిమానుల నోటి నుంచి తరచుగా వినబడుతుండే మాట ‘పవనిజం’. అసలు, ‘పవనిజం’ అంటే ఏమిటనే ప్రశ్నకు పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘‘పవనిజం’ అనేది పార్టీ పెట్టకముందు నుంచి.. 2008, 2009 నుంచి ఉంది. ఈ ‘పవనిజం’ అనే మాట ఎందుకొచ్చిందో కల్యాణ్ బాబుకు కూడా తెలియదు. నాక్కూడా మొదట్లో తెలిసేది కాదు. అసలు ‘పవనిజం’ అంటే ఏంటో ఎవరికీ తెలియదు. కానీ, ‘పవనిజం’ అని ఎవరైతే అంటున్నారో వాళ్లకు మాత్రం తెలుసు పవనిజమంటే. ‘పవనిజం’ అంటే ట్రూత్. నిజాన్ని మనం…

readMore

అనుకోకుండా హైదరాబాద్ లో దిగి.. టాక్సీ మాట్లాడుకుని…!

1980 దశకంలో బీజేపీ అధ్యక్షుడిగా వాజ్ పేయి బెంగళూరు వెళుతూ మధ్యలో హైదరాబాద్ లో ఆగిన విమానం ఆ సమయంలో నగరంలో హెగ్డేవార్ శతజయంతి వేడుకలు విషయం తెలిసి విమానం దిగేసిన వాజ్ పేయి ఇది 1980 దశకం నాటి సంగతి. అటల్ బిహారీ వాజ్ పేయి బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా 1980 నుంచి 1986 వరకూ పనిచేశారన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆయన హైదరాబాద్ ఎయిర్ పోర్టు నుంచి టాక్సీ వేసుకుని వచ్చి అందరినీ ఆశ్చర్య పరిచారు. ఆయన కర్ణాటకలో ఓ కార్యక్రమానికి హాజరు కావాల్సిన నిమిత్తం విమానంలో బయలుదేరగా, మార్గమధ్యంలో హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయంలో విమానం ఆగింది. ఆ సమయంలో హైదరాబాద్ లో హెగ్డేవార్ శతజయంతి ఉత్సవాలను జరుపుతున్నారని వాజ్ పేయికి ఎవరో చెప్పారు. వెంటనే ఆయన విమానం దిగి, బయటకు…

readMore