నీలో ఉన్న కెవిన్ ఎప్పుడు చస్తాడో !?

నీలో ఉన్న కెవిన్ ఎప్పుడు చస్తాడో !?

రాబందును చూసి తన చేతిలో ఉన్న ముద్ద ఎక్కడ లాక్కుంటుందో అన్న భయంతో ఆ చిన్నారి దోసెటని ఒంటికింద దాచుకుంది. కానీ రాబందు అసలు వేట…. బక్కపలచగా మారి ఏ క్షణాన్నయినా చనిపోతుందని ఎదురు చూసిన ఆ చిన్నారే అని ఆ పాపకు తెలియదు. …….. ఈ ఫొటో 1990 దశకంలో తను తీసిన ఒక ఫొటోతో దశదిశలా ప్రఖ్యాతి గాంచిన వ్యక్తి. #పేరు కెవిన్ కార్టర్ #దేశం‌: సౌతాఫ్రికా మీరు చూస్తున్న ఈ ఫొటో జగద్విఖ్యాతం. ప్రపంచంలోని 100 ప్రభావవంతమైన చిత్రాల్లో ఇది మొదటిది. నార్త్ ఆఫ్రికా సుడాన్‌లో 1990ల్లో వచ్చిన కరువు వల్ల చాలా మంది పెద్దలూ, పిల్లలూ చనిపోయారు. ఆకలి, దాహం ఆక్రందనలు సుడాన్ మొత్తం వినిపించాయి. …. న్యూయార్క్ టైమ్స్ పత్రిక.. కరువు చిత్రాల సేకరించే పని కెవిన్‌కు అప్పజెప్పింది. కెవిన్…

readMore

తుంగభద్ర పరీవాహకంలో పెన్నహోబిళం వద్ద సుందర జలపాతం

pennobilam water falls

అనంతపురం జిల్లాలో ప్రత్యేక ఆకర్షణ పర్యాటకులకు కనువిందు చేస్తున్న నీటి సవ్వడులు జిల్లా వాసులతోపాటు కర్ణాటక నుంచి భారీగా సందర్శకులు అనంతపురం జిల్లాలో ఓ సందర్శక స్థలం రూపుదిద్దుకుంటోంది. తుంగభద్ర పరీవాహకంలో పెన్నహోబిళం వద్ద కనువిందు చేస్తున్న జలపాతం పర్యాటకులను ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది. జిల్లా వాసులతోపాటు కర్ణాటక నుంచి పెద్ద సంఖ్యలో సందర్శకులు తరలివస్తుండడంతో నిత్యం జనసందోహం కనిపిస్తోంది. జిల్లాలోని ఉరవకొండ సమీపంలో పెన్నహోబిళం వద్ద కొండల నడుమ నుంచి జాలువారుతున్న తుంగభద్రమ్మ గలగలలు ఆకట్టుకుంటున్నాయి. తుంగభద్ర నుంచి జిల్లాలోని ఎంపీఆర్‌ జలాశయానికి వెళ్లే నీరు కొండకోనల గుండా ప్రవహిస్తూ ఇక్కడి ఎత్తయిన రాళ్ల మీదుగా జాలువారుతుండడం జలపాతాన్ని తలపిస్తోంది. ఇక్కడ ప్రఖ్యాత దేవాలయ సముదాయం కూడా ఉండడంతో సందర్శకులు ఆధ్యాత్మిక, పర్యాటక ఆనందానుభూతిని పొందుతున్నారు. సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడుతున్నారు. కొందరు లఘుచిత్రాలు షూటింగ్‌కు ఈ…

readMore

Marvelous Murals of Ajanta

Ajanta Caves are located in Aurangabad district of  Maharashtra. About 30 rock-cut Buddhist cave monuments which date back to 2nd century BC to 650 AD. The caves include paintings and sculptures described as the finest surviving examples of Indian art, particularly painting.Theyare masterpieces of Buddhist religious art, with figures of the Buddha and depictions of Jataka tales. Paintings in the Ajanta Caves are based on the episode drawn from the life of Buddha. These paintings are regarded as some of the finest frescoes and have widened their influence worldwide. The…

readMore

గుత్తి కోట

గుత్తి కోట

గుత్తి కోట అనంతపురం జిల్లా గుత్తి పట్టణ సమీపంలో ఉంది. గుత్తి కోట చాళుక్యుల కాలములో కట్టబడినదని భావిస్తారు. విజయనగర రాజులు దీనిని పటిష్ఠము చేసారు. గుత్తి కోటను ప్రస్తావించిన తొలి శాసనాలు కన్నడము మరియుసంస్కృతములో ఉన్నాయి. అవి 7వ శతాబ్దము నాటివని అంచనా. విజయనగర చక్రవర్తి బుక్క రాయల శాసనములో గుత్తి కోట దుర్గ రాజముగా కీర్తించబడింది. గుత్తి కైఫియత్ ప్రకారo కోటను మీర్ జుమ్లా ఆక్రమించుకొనెను. కోటను 1746 లో మురారి రావు ఆధ్వర్యములో మరాఠులు జయించారు. 1775 లో హైదర్ అలీ గుత్తికోటను తొమ్మిది నెలల నిర్భంధo తర్వాత వశపరచుకొనెను. 1779 లో టిప్పూసుల్తాన్ మరణానంతరము జెరువార్ ఖాన్ అనే సేనాని ఆధీనoలో ఉండగా నిజాo తరఫునబ్రిటిషు కల్నల్ బౌజర్ కోటను ఆక్రమించుకొని బ్రిటిషు వారి పాలనలోకి తెచ్చాడు.  కోట దాదాపు 300 మీటర్ల ఎత్తున ఉంది. కోట నత్తగుల్ల/ శంఖము/గవ్వ ఆకారoలోనిర్మించబడిoది.  15 బురుజులతో, 15 ముఖద్వారములు కలిగి ఉంది. ఇందులో రెండు శాసనములు, వ్యాయామశాల మరియు మురారి రావు గద్దె ఉన్నాయి. మురారిరావు గద్దె నుండి మొత్తం గుత్తి ఊరంతా చక్కగా కనిపిస్తుంది.

readMore

పరశురామేశ్వర ఆలయం- భువనేశ్వర్

Parasurameswar_temple_linga (1)

పరశురామేశ్వర ఆలయం ఒడిషా రాష్ట్ర ముఖ్య పట్టణమైన భువనేశ్వర్ నందు గల విశిష్ట ఆలయం. ఈ ఆలయం క్రీ.శ 7 మరియు 8 ల మధ్య కాలంలోని శైలోద్భవుల కాలానికి చెందిన ప్రసిద్ధి చెందిన దేవాలయం. ఈ దేవాలయ ప్రధాన దైవo శివుడు. ఈ దేవాలయం ఒడిషాలోని ప్రాచీన దేవాలయాలలో ఒకటి. ఈ దేవాలయం క్రీ.శ 670 లో నగర శైలిలో నిర్మితమైనది. ఈ దేవాలయం 10 వ శతాబ్దానికి పూర్వం ఉన్న ఒడిషా దేవాలయాలకు గల ముఖ్య లక్షణాలు కలిగి యున్నది. ఈ దేవాలయం భువనేశ్వర్ లోని ప్రాచీన దేవాలయాలలోని పరశురామేశ్వర దేవాలయాల వర్గానికి చెందిన ఒక దేవాలయంగా ప్రసిద్ధి పొందింది. పరశురామేశ్వర దేవాలయం లో “విమానం” , “గర్భగుడి” మరియు “బాడ” ఉన్నవి.దాని పైకప్పు మీద వక్రరేఖలు గల శిఖరం ఉన్నది. ఈ శిఖరం…

readMore