ప్రత్యర్థి కంపెనీలకు ఎయిర్ టెల్ మరో సవాల్… రూ.558తో రోజూ 3జీబీ డేటా

ఉచిత కాల్స్, ఎస్ఎంఎస్ సదుపాయాలు వొడాఫోన్, జియోకు పోటీ వొడాఫోన్ సైతం ఇవే బెనిఫిట్స్ తో రూ.569 ప్లాన్ టెలికం కంపెనీల మధ్య డేటా వార్ కొనసాగుతోంది. ఎయిర్ టెల్ మరో సరికొత్త ప్లాన్ ను ప్రకటించి పోటీ కంపెనీలకు సవాల్ విసిరింది. రూ.558తో రీచార్జ్ చేసుకునే వారికి ప్రతి రోజూ 3జీబీ 4జీ డేటాను 82 రోజుల పాటు అందించనుంది. 82 రోజుల్లో మొత్తం 246 జీబీ డేటాను ఆఫర్ చేస్తోంది. అలాగే, అన్ లిమిటెడ్ కాల్స్, రోజూ 100 ఎస్ఎంఎస్ లు ఉచితం. వాయిస్ కాల్స్ పై ఎటువంటి పరిమితి లేదు. వొడాఫోన్ ఇటీవలే రూ.511, రూ.569తో ప్లాన్లను తీసుకువచ్చింది. ఇందులో రూ.569 ప్లాన్ లో రోజూ 3జీబీ డేటాను, రూ.511 ప్లాన్ లో రోజూ 2జీబీ డేటాను ఆఫర్ చేస్తోంది. వీటి వ్యాలిడిటీ…

ఇంకా ఉంది

రూ.45 కోట్లు పలికిన గోల్కొండ నీలి వజ్రం

మనదేశంలోని గోల్కొండ గనుల్లో బయటపడి.. ఐరోపా రాజవంశీయుల చేతుల్లోకి వెళ్లిన అరుదైన నీలి వజ్రం ‘ఫార్నెస్‌ బ్లూ’ తాజాగా వేలంలో భారీ ధర పలికింది. 6.16 క్యారట్ల స్వచ్ఛమైన ఈ వజ్రం బేరీపండు ఆకారంలో ఉంటుంది. సోథిబే సంస్థ మంగళవారం దాన్ని వేలం వేయగా.. గుర్తుతెలియని ఔత్సాహికుడు దాదాపు రూ.45 కోట్ల భారీమొత్తానికి దక్కించుకున్నారు. ‘ఫార్నెస్‌ బ్లూ’ ఫ్రాన్స్‌, ఇటలీ, ఆస్ట్రియాల్లోని పలు రాజకుటుంబీకుల చేతులు మారింది. స్పెయిన్‌ రాజు ఫిలిప్‌-5 రెండో భార్య ఎలిసబెత్‌ ఫార్నెస్‌ పేరుమీదుగా దానికి ఆ పేరొచ్చింది. పెళ్లి కానుకగా 1715లో ఎలిజబెత్‌ ఈ వజ్రాన్ని అందుకున్నారు.

ఇంకా ఉంది

మళ్లీ కోర్టుకు జియో… ఎయిర్ టెల్ పై ‘ఐపీఎల్’ వార్!

‘సీజన్ పాస్’ అంటూ ఎయిర్ టెల్ యాడ్ కస్టమర్లను తప్పుదారి పట్టిస్తోందంటున్న జియో గతంలోనే విచారించి తీర్పిచ్చిన ఢిల్లీ హైకోర్టు అమలు చేయలేదంటూ మళ్లీ కోర్టుకు జియో ఎయిర్ టెల్ తమ వ్యాపార ప్రకటనల ద్వారా తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తోందని ఆరోపిస్తూ రిలయన్స్ జియో మరోసారి కోర్టుకు ఎక్కింది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో ‘సీజన్ పాస్’ అంటూ ఎయిర్ టెల్ సంస్థ ‘లైవ్ అండ్ ఫ్రీ యాక్సెస్’ పేరిట ప్రకటనలు ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ విషయంలో కస్టమర్లను ఆ సంస్థ తప్పుదారి పట్టిస్తోందని, హాట్ స్టార్ నుంచి మాత్రమే ప్రత్యక్ష ప్రసారం ఉంటుందని, దీన్ని చూసేందుకు డేటా చార్జీలు ఉంటాయన్న విషయాన్ని ఎవరికీ కనిపించకుండా ముద్రిస్తోందన్నది జియో ఆరోపణ. దీనిపై గతంలో విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు, ప్రింట్ మీడియా ప్రకటనల్లో…

ఇంకా ఉంది

గూగుల్ కొత్త ఫీచ‌ర్‌… రిమైండ‌ర్ యాడ్‌ను మ్యూట్ చేసుకునే అవ‌కాశం

google search new features list

సెర్చ్ చేసిన విష‌యాల‌ను మ‌ళ్లీ మ‌ళ్లీ గుర్తుచేసే రిమైండ‌ర్ యాడ్స్‌ ప్ర‌స్తుతానికి కొన్ని వెబ్‌సైట్ల‌కు మాత్ర‌మే ప‌రిమితం త్వ‌ర‌లో యూట్యూబ్‌, జీమెయిల్‌లో ప్ర‌క‌ట‌న‌ల‌కు కూడా అనువ‌ర్తితం గూగుల్‌లో ఏదైనా వ‌స్తువును గానీ, విష‌యాల‌ను సెర్చ్ చేసిన త‌ర్వాత, ఇత‌ర వెబ్‌సైట్లు ఓపెన్ చేసిన‌పుడు అక్క‌డి ప్ర‌క‌ట‌న‌ల‌లో సెర్చ్ చేసిన అంశాలు క‌నిపిస్తుండటం చూస్తూనే ఉంటాం. వీటిని రిమైండ‌ర్ యాడ్స్ అంటారు. ఇక నుంచి వీటిని మ్యూట్ చేసుకునే స‌దుపాయాన్ని గూగుల్ క‌ల్పించింది. ‘మ్యూట్ దిస్ యాడ్’ పేరుతో ఈ ఫీచ‌ర్‌ను గూగుల్ ప్ర‌వేశ‌పెట్టింది. ప్ర‌స్తుతం కొన్ని వెబ్‌సైట్ల‌కు మాత్ర‌మే ఈ ఫీచ‌ర్‌ను ప‌రిమితం చేసింది. త్వ‌ర‌లో యూట్యూబ్‌, జీమెయిల్‌లో ప్ర‌క‌ట‌న‌ల‌కు కూడా ఈ ఫీచ‌ర్‌ను అనువ‌ర్తితం చేయ‌నుంది. రిమైండ‌ర్ యాడ్స్ కార‌ణంగా గ‌తంలో యూజ‌ర్ సెర్చ్ చేసిన విష‌యాల‌ను గుర్తు చేస్తున్న కార‌ణంగా కొంత‌మంది యూజ‌ర్లు ఇబ్బంది…

ఇంకా ఉంది

భారత్ సరిహద్దులో భారీ బంగారు గనులు.. తవ్వకాలు ప్రారంభించిన చైనా

అరుణాచల్‌ప్రదేశ్ సరిహద్దును ఆనుకుని భారీ బంగారు గని తవ్వకాలు ప్రారంభించిన చైనా రాష్ట్రాన్ని చేజిక్కించుకునేందుకు ‘డ్రాగన్’ ప్లాన్ చైనా అధీనంలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో దాదాపు 4 లక్షల కోట్ల రూపాయల విలువైన భారీ బంగారు, వెండి, ఇతర ఖనిజాల గనులు ఉన్నట్టు హాంకాంగ్‌కు చెందిన ఓ పత్రిక తెలిపింది. గనులు ఉన్నట్టు చెబుతున్న ప్రాంతంలో చైనా ఇప్పటికే తవ్వకాలు ప్రారంభించినట్టు ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ వెల్లడించింది. చైనా ఇక్కడ ఎప్పటి నుంచో తవ్వకాలు జరుపుతున్న చైనా, ఇటీవల వాటిని మరింత పెంచిందని వివరించింది. అరుణాచల్ ప్రదేశ్‌తో సరిహద్దును పంచుకుంటున్న ళుంజె కౌంటీలో ఉన్న గనులను సొంతం చేసుకునేందుకు చైనా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోందని పత్రిక పేర్కొంది. అరుణాచల్ ప్రదేశ్‌ను ఇప్పటికే వివాదాస్పద ప్రాంతంగా చెబుతున్న డ్రాగన్ కంట్రీ దక్షిణ టిబెట్‌లో అరుణాచల్…

ఇంకా ఉంది