ఫోర్బ్స్ తాజా జాబితా… శక్తిమంత సంపన్నుల్లో ఉపాసన, సింధు!

ఉజ్వల భవిష్యత్తు ఉన్న శక్తిమంతమైన సంపన్నుల జాబితాలో టాలీవుడ్ హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన, ఒలంపిక్‌ పతక విజేత పీవీ సింధులకు స్థానం లభించింది. వ్యాపారం, వాణిజ్యం, నటన, క్రీడలకు సంబంధించి, ఇండియాకు చెందిన 22 మంది యువ శక్తిమంతుల జాబితాను ‘టైకూన్స్‌ ఆఫ్‌ టుమారో’ పేరిట ‘ఫోర్బ్స్‌ ఇండియా’ విడుదల చేసింది.ఈ జాబితా తయారీలో వారివారి నికర సంపదను ప్రామాణికంగా తీసుకోలేదని క్లారిటీ ఇచ్చిన ‘ఫోర్బ్స్’, ఆయా రంగాల్లో వారు చూపుతున్న ప్రతిభ, కుటుంబ వ్యాపారాలు, తొలితరం నటులు, క్రీడాకారులు, వ్యాపారవేత్తల శక్తి సామర్థ్యాలు, ప్రస్తుతం వీరి వ్యాపకం తదితరాలను పరిగణనలోకి తీసుకున్నట్టు తెలిపింది. ఈ జాబితాలో, అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కరణ్‌ అదానీ, ఇండియన్‌ ఎక్స్‌ ప్రెస్‌ గ్రూప్‌ ఈడీ అనంత్‌ గోయెంకా, ఫ్యూచర్‌ కన్స్యూమర్ ఎండీ ఆశ్ని…

readMore

మహాకూటమిలో చేరిన మరో పార్టీ

రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఓడించడమే లక్ష్యంగా మహాకూటమి ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ కూటమిలో ఇప్పటికే కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ లు భాగస్వాములుగా ఉన్నాయి. తాజాగా ఈ కూటమిలోకి మరో పార్టీ వచ్చి చేరింది. ‘తెలంగాణ ఇంటి పార్టీ’ మహాకూటమితో చేతులు కలిపింది. ఈ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ నిన్న కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో భేటీ అయ్యారు. మహాకూటమికి మద్దతు పలుకుతున్నట్టు తెలిపారు. కూటమిలో చేరుతున్నందున తమ పార్టీకి కేటాయించాల్సిన స్థానాలపై చర్చించారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ, ఈ విషయాన్ని పార్టీ దృష్టికి తీసుకెళతామని సుధాకర్ కు హామీ ఇచ్చారు.

readMore

ఏకాగ్రతను దెబ్బతీసి గెలిచిన మారిన్: బాధగా ఉందన్న పీవీ సింధు

సిద్ధం కాకముందే మారిన్ సర్వీస్ లు తొలి గేమ్ లో చేసిన రెండు మూడు తప్పులే కొంపముంచాయి వచ్చే సంవత్సరం స్వర్ణం సాధిస్తానన్న తెలుగుతేజం షటిల్ కోర్టుపై చాలా వేగంగా కదులుతూ ఉండే కరోలినా మారిన్ చేతిలో వరల్డ్ బ్యాడ్మింటన్ ఫైనల్ పోరులో ఓడిపోయిన తెలుగుతేజం పీవీ సింధూ, ఈ ఓటమి తనకెంతో బాధను కలిగించిందని వ్యాఖ్యానించింది. అయితే, ప్రపంచ టాప్ క్రీడాకారిణులతో పోటీపడి పతకం గెలవడం తనకు సంతోషంగా ఉందని పేర్కొంది. ఫైనల్ పోరులో తనను మానసికంగా దెబ్బకొట్టేందుకు మారిన్ పన్నిన వ్యూహం ముందు తాను తలొగ్గడమే ఓటమికి కారణమైందని సింధూ వ్యాఖ్యానించింది. తాను సిద్ధం కాకుండానే మారిన్ సర్వీస్ లు చేసిందని, దానివల్ల తన ఏకాగ్రత దెబ్బతిందని చెప్పింది. కొన్ని పొరపాట్లు కూడా తనవైపు నుంచి జరిగాయని, తొలి గేమ్ లో ఆధిక్యంలో ఉండి…

readMore

భారత ప్రభుత్వంతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటా: కపిల్ దేవ్

ఆహ్వానం వచ్చిందో, లేదో ఇంకా తెలియదు ఇన్విటేషన్ వస్తే కచ్చితంగా వెళ్తా కేంద్ర ప్రభుత్వంతో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటా పాక్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారానికి హాజరవుతానని క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ తెలిపారు. అయితే తనకు ఇమ్రాన్ నుంచి ఆహ్వానం అందిందో, లేదో ఇంకా తెలియదని… ఒకవేళ ఆహ్వానం వస్తే కచ్చితంగా వెళ్తానని, ఇమ్రాన్ ప్రమాణ స్వీకారాన్ని ప్రత్యక్షంగా చూస్తానని చెప్పారు. అయితే భారత ప్రభుత్వంతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటానని అన్నారు. ఈ నెల 11న పాక్ ప్రధానిగా ఇమ్రాన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నుంచి సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, సిద్ధూలకు ఆహ్వానాలు అందాయి. పాకిస్థాన్ కు వెళ్తున్నానని సిద్ధూ ఇప్పటికే ప్రకటించగా… గవాస్కర్ ఇంకా స్పందించలేదు.

readMore

బాలీవుడ్‌ స్టార్‌కు ధోనీ ఫుట్‌బాల్‌ పాఠాలు

భారత క్రికెట్‌ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ సహచర ఆటగాళ్లకు సలహాలు, సూచనలు ఇవ్వడంలో ముందుంటాడు. తాజాగా ధోనీ మరోసారి తన అనుభవాలను ఇతరులతో పంచుకుంటూ కనిపించాడు. ఐతే, ఈ సారి క్రికెట్‌ గురించి కాదండోయ్‌. మరి ఇంకా దేని గురించా అని అనుకుంటున్నారా.. ధోనీకి ఎంతో ఇష్టమైన ఫుట్‌బాల్‌ గురించి. ఇంతకీ ధోనీ వద్ద ట్రిక్స్‌ నేర్చుకుంది ఎవరో తెలుసా.. ధడక్‌ స్టార్‌ ఇషాన్‌ ఖట్టర్‌. ఔను.. తాజాగా వీరు ముంబయిలో కలిశారు. ఇద్దరూ కలిసి ఫుట్‌బాల్‌ ఆడుతూ కనిపించారు. అంతేకాదు ధోనీ నుంచి ఇషాన్‌ ఫుట్‌బాల్‌ పాఠాలు కూడా నేర్చుకున్నాడు. కొంతమంది టీవీ స్టార్లు కూడా ధోనీతో కలిసి ఆడారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఏటా బాలీవుడ్‌ స్టార్లు – క్రికెటర్ల మధ్య ఛారిటీ మ్యాచ్‌…

readMore