ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీరేటు పెంచిన ఎస్‌బీఐ

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కస్టమర్లకు శుభవార్త. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై బ్యాంకు వడ్డీరేటును పెంచింది. డిపాజిట్లపై 5 నుంచి 10 బేసిస్‌ పాయింట్ల వరకు పెంచింది. కొత్త వడ్డీ రేట్లు జులై 30వ తేదీ నుంచి అమలవుతాయి. వివిధ కాలపరిమితులతో సాధారణ, వయో వృద్ధులు చేసే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకు ఇచ్చే వడ్డీ రేట్లలో చేసిన మార్పులను ఎస్‌బీఐ తన వెబ్‌సైట్‌లో ఉంచింది. ఏడాది నుంచి పదేళ్ల కాలపరిమితికి రూ. కోటి కంటే తక్కువ చేసిన డిపాజిట్లపై వడ్డీని 5 నుంచి 10 బేసిస్‌ పాయింట్ల మధ్య పెంచింది. అంటే 0.05శాతం నుంచి 0.1శాతం పెరుగుతుంది. సాధారణ ప్రజలకు ఏడాది నుంచి రెండేళ్ల కంటే తక్కువ కాలపరిమితికి చేసిన డిపాజిట్లపై గతంలో వడ్డీరేటు 6.65శాతం ఉండగా ఇప్పుడు 6.7శాతానికి పెరిగింది. రెండేళ్ల నుంచి మూడేళ్ల కంటే తక్కువ కాలపరిమితికి…

readMore

ప్రభుత్వ ఉద్యోగాలు

డీఎఫ్‌సీసీఐఎల్‌లో 1572 పోస్టులు సంస్థ: డెడికేటెడ్‌ ఫ్రెయిట్‌ కారిడార్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (డీఎఫ్‌సీసీఐఎల్‌), న్యూదిల్లీ. మొత్తం ఖాళీలు: 1572 పోస్టులవారీ విభజన: ఎగ్జిక్యూటివ్‌-327, టెక్నీషియన్‌-349, ఎంటీఎస్‌-896. అర్హత: పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ, మూడేళ్ల ఇంజినీరింగ్‌ డిప్లొమా. ఎంపిక: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌, సైకో టెస్ట్‌, మెడికల్‌ ఎగ్జామ్‌ ద్వారా. పరీక్ష తేది: అక్టోబరు 1 నుంచి 5 దరఖాస్తు: ఆన్‌లైన్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తు: 01.08.2018 నుంచి 31.08.2018 వరకు. వెబ్‌సైట్‌: http://dfccil.gov.in/ డీఆర్‌డీఓలో 494 టెక్నికల్‌ అసిస్టెంట్లు సంస్థ: డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీఓ)- సెంటర్‌ ఫర్‌ పర్సనల్‌ టాలెంట్‌ మేనేజ్‌మెంట్‌ (సెప్టమ్‌). పోస్టు: సీనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌ ‘బి’ ఖాళీలు: 494 అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ, ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణత. వయసు: 18-28…

readMore

మిషన్‌ ఇంపాసిబుల్‌: ఫాలౌట్‌ రివ్యూ

చిత్రం: మిషన్‌ ఇంపాసిబుల్‌ ఫాలౌట్‌ నటీనటులు: టామ్‌ క్రూజ్‌, హెన్రీ కవిల్‌, వింగ్‌ రేమ్స్‌, సిమన్‌ పెగ్‌, రెబాక ఫెర్గ్యూసన్‌, సీన్‌ హారిస్‌, ఏంజిలా బాసెట్‌ తదితరులు సంగీతం: లార్నీ బాల్ఫీ సినిమాటోగ్రఫీ: రాబ్‌ హార్డీ ఎడిటింగ్‌: ఎడ్డై హామిల్టన్‌ నిర్మాత: టామ్‌ క్రూజ్‌, జేజే అబ్రామ్స్‌, డేవిడ్‌ ఎల్లిసన్‌ దర్శకత్వం: క్రిస్టోఫర్‌ మెక్‌క్వారీ బ్యానర్‌: పారామౌంట్‌ పిక్చర్స్‌ విడుదల తేదీ: 27-07-2018 ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రేక్షకాదరణ కలిగిన చిత్రాల్లో ‘మిషన్‌ ఇంపాసిబుల్‌’ సిరీస్‌ ఒకటి. టామ్‌ క్రూజ్‌ కథానాయకుడిగా ఇప్పటివరకూ ఈ సిరీస్‌లో వచ్చిన ఐదు చిత్రాలూ విజయం సాధించాయి. 1996లో వచ్చిన తొలి చిత్రం మొదలుకొని ఇప్పుడు విడుదలవుతున్న ఆరో చిత్రం వరకూ టామ్‌క్రూజే కథానాయకుడిగా నటించారు. వాటిలో ఈథన్‌ హంట్‌ అనే గూఢచారి పాత్రలో నటింటిన టామ్‌.. తన పోరాటాలు, సాహసాలతో యాక్షన్‌ హీరోగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. మిషన్‌ ఇంపాసిబుల్‌ సిరీస్‌ చిత్రాలన్నీ ప్రపంచవ్యాప్తంగా…

readMore

హ్యాపీ వెడ్డింగ్‌ రివ్యూ

చిత్రం: హ్యాపీ వెడ్డింగ్‌ ‌ నటీనటులు: సుమంత్‌ అశ్విన్‌, నిహారిక కొణిదెల, మురళీ శర్మ, నరేష్‌, పవిత్ర లోకేష్‌, తులసి, ఇంద్రజ, అన్నపూర్ణ తదితరులు సంగీతం: శక్తికాంత్‌ కార్తీక్‌ నేపథ్య సంగీతం: తమన్‌ సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, శ్రీమణి ఛాయాగ్రహణం: బాల్‌రెడ్డి ఎడిటింగ్‌: కె.వి. కృష్ణారెడ్డి నిర్మాత: ఎం. సుమంత్‌ రాజు రచన-దర్శకత్వం: లక్ష్మణ్‌ సంస్థ: పాకెట్‌ సినిమా, యూవీ క్రియేషన్స్‌ విడుదల తేదీ: 28-07-2018 తనకు సరిపోయే కథలను మాత్రమే ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకు వెళ్తున్న యువ కథానాయకుడు సుమంత్‌ అశ్విన్‌. ఇక మెగా కుటుంబ నుంచి బుల్లితెరపైకి వచ్చి, ఆ తర్వాత వెబ్‌ సిరీస్‌లతో తన సత్తా చాటుతోంది నిహారిక కొణెదల. ‘ఒక మనసు’తో కథానాయికగా ఎంట్రీ ఇచ్చి తనదైన నటనతో మెప్పించారు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి లక్ష్మణ్‌ దర్శకత్వంలో నటించిన చిత్రం ‘హ్యాపీ వెడ్డింగ్‌’. పెళ్లి తాలుకూ సంతోషాలకు అద్దం పట్టే కథతో శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చిందీ…

readMore

‘తేజ్ ఐ లవ్ యూ’ మూవీ రివ్యూ

tej-i-love-you-movie-review-in-telugu-sai-dharam-te

సాయిధరమ్ తేజ్. సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న మెగా కాంపౌండ్  హీరో. ఈ కుర్ర హీరో చేసిన సినిమాలు అన్న వరస పెట్టి ఫట్ అనటంతో ఈ సారి హిట్ కోసం ఓ లవ్ స్టోరీని నమ్ముకున్నాడు. అందునా కరుణాకరన్ దర్శకుడు కావటంతో ప్రేక్షకులు సైతం దీనిపై ఓ మోస్తరు అంచనాలు పెట్టుకున్నారు. సాయిధరమ్ తేజ్ కు జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటించింది. ఓ అందమైన  ఉమ్మడి కుటుంబంలోని కుర్రాడే సాయిధరమ్ తేజ్. చిన్నప్పుడే తల్లితండ్రులు చనిపోవటంతో పెద్దనాన్న, బాబాయిలతో కూడిన ఫ్యామిలీలో పెరుగుతాడు. ఓ రోజు సైకిల్ పై  ట్యూషన్ కు వెళ్ళి వస్తూ ఉండగా కారు ట్రబుల్ ఇఛ్చి..కష్టాల్లో ఉన్న మహిళను తన సైకి ల్ పై ఎక్కించుకుని పక్కనే ఉన్న రైల్వే స్టేషన్ కు చేరుస్తాడు. ఆ మహిళను  మధ్యలో రౌడీలు రేప్…

readMore