నా మతాన్ని రక్షించుకునేందుకే గౌరీ లంకేశ్ ను చంపేశా!: పరశురామ్

గౌరీ లంకేశ్‌ను చంపింది నేనే హత్యకు ముందు ఆమె ఎవరో నాకు తెలియదు చంపకుండా ఉండాల్సింది తన మతాన్ని రక్షించుకునేందుకే జర్నలిస్టు గౌరీ లంకేశ్‌ను హత్య చేసినట్టు నిందితుడు పరశురామ్ వామోర్ (26) సిట్ అధికారుల విచారణలో వెల్లడించాడు. అయితే, తాను ఎవరిని చంపింది ఆ సమయంలో తనకు తెలియదని పేర్కొన్నాడు. గతేడాది సెప్టెంబరు 5న బెంగళూరు ఆర్ఆర్ నగర్‌లోని తన ఇంటి బయటే గౌరీ లంకేశ్ దారుణ హత్యకు గురయ్యారు. ‘‘నా మతాన్ని రక్షించుకోవాలంటే ఒకరిని చంపాలని 2017 మే నెలలో నాకు చెప్పారు. నేను దానికి అంగీకరించాను. అయితే, నేను చంపేది ఎవరిన్నది మాత్రం నాకు తెలియదు. కానీ, ఇప్పుడనిపిస్తోంది.. ఆమెను చంపకుండా ఉంటే బాగుండునని’’ అని విచారణలో పరశురామ్ పేర్కొన్నాడు. తనను సెప్టెంబరు 3న బెంగళూరుకు తీసుకొచ్చారని, ఎయిర్‌గన్‌ను కాల్చడాన్ని బెల్గావిలో నేర్చుకున్నానని…

ఇంకా ఉంది

విజయ్ మాల్యాకు బ్రిటన్ కోర్టు నుండి ఊరట.. ఆస్తుల సీజ్‌కు కోర్టు నిరాకరణ

మాల్యా ఆస్తుల సీజ్‌కు కోర్టు నిరాకరణ న్యాయపోరాట ఖర్చులు మాత్రం చెల్లించాల్సిందేనని ఆదేశం భారత్‌కు పంపే విషయంలో వచ్చే నెలలో తుది విచారణ కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ బకాయిలను రాబట్టుకునేందుకు బ్రిటన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన 13 బ్యాంక్‌ల కన్సార్టియంకు ఊరట లభించింది. న్యాయపోరాట ఖర్చుల కింద భారత బ్యాంకులకు 2 లక్షల పౌండ్లు (రూ.1.80 కోట్లు) చెల్లించాలని ఆర్థిక నేరగాడు విజయ్ మాల్యాను ఆదేశించింది. కేసును విచారించిన న్యాయమూర్తి ఆండ్రూ హెన్షా.. మాల్యా ఆస్తులను స్తంభింపజేసేందుకు నిరాకరించారు. అయితే, బ్యాంకులకు అవుతున్న ఖర్చును మాత్రం తప్పకుండా చెల్లించాల్సిందేనని ఆదేశించారు. మాల్యాను భారత్‌కు పంపాల్సిందిగా కోరుతూ భారత్ వేసిన పిటిషన్‌పై వచ్చే నెల వెస్ట్‌మినిస్టర్‌ కోర్టులో తుది వాదనలు జరగనున్నాయి. స్టేట్‌ బ్యాంకు సహా దేశంలోని 13 బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.9 వేల కోట్లకుపైగా రుణాలను ఎగ్గొట్టిన విజయ్…

ఇంకా ఉంది

ఇన్ఫోసిస్ లో నాడు రూ.10వేలు పెట్టి ఉంటే… నేడు రూ.2.5 కోట్లు

1993లో ఐపీవో తర్వాత లిస్ట్ అయిన కంపెనీ 5 మిలియన్ డాలర్ల నుంచి 10.9 బిలియన్ డాలర్ల ఆదాయానికి… 250 మంది ఉద్యోగుల నుంచి 2 లక్షల మంది ఉద్యోగుల స్థాయికి చేరిక దేశ రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి నేటితో 25 సంవత్సరాలు. కానీ కంపెనీ 37 ఏళ్లుగా కార్యకలాపాల్లో ఉంది. ఈ కాలంలో కంపెనీ ఎంతో ఘనతను సొంతం చేసుకుంది. 1981లో నారాయణమూర్తి, మరో ఆరుగురు కలసి ఏర్పాటు చేశారు. 250 డాలర్ల పెట్టుబడితో ప్రారంభించారు. మూర్తి తన శ్రీమతి సుధామూర్తి దగ్గర రూ.10,000 బదులు తీసుకుని పెట్టుబడి సమకూర్చారు. 1993లో ఇన్ఫోసిస్ లిస్ట్ అయింది. నాడు ఐపీవో పూర్తిగా సబ్ స్క్రయిబ్ కాకపోతే ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్ ఇనామ్, మోర్గాన్ స్టాన్లీ ఆదుకున్నాయి. ఒక్కో షేరును…

ఇంకా ఉంది

జయనగర్ బై పోల్స్… విజయాన్ని ఖాయం చేసుకున్న సౌమ్యా రెడ్డి!

ముగిసిన 8 రౌండ్ల కౌంటింగ్ 10 వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో సౌమ్యా రెడ్డి కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు బీజేపీ అభ్యర్థి మరణంతో ఉప ఎన్నిక జరిగిన బెంగళూరు పరిధిలోని జయనగర్ లో కాంగ్రెస్ అభ్యర్థిని, మాజీ హోమ్ మంత్రి రామలింగారెడ్డి కుమార్తె సౌమ్యా రెడ్డి తన విజయాన్ని దాదాపు ఖాయం చేసుకున్నారు. ఈ ఉదయం నుంచి కౌంటింగ్ జరుగుతుండగా, 8వ రౌండ్ లెక్కింపు ముగిసేసరికి ఆమె తన సమీప ప్రత్యర్థి, బీజేపీ తరఫున పోటీ చేసిన దివంగత బిఎన్‌ విజయ్‌ కుమార్‌ సోదరుడు బిఎన్‌ ప్రహ్లాద్‌ కన్నా 10 వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో దూసుకెళుతున్నారు. 8వ రౌండ్ తరువాత కాంగ్రెస్ అభ్యర్థినికి 31,642, బీజేపీఅభ్యర్థికి 21,437 ఓట్లు రాగా, నోటాకు 361 ఓట్లు వచ్చాయి. సౌమ్యా రెడ్డి గెలుపు ఖాయం కావడంతో, ఆమె అనుచరులు,…

ఇంకా ఉంది

మా ఉత్పత్తులపై భారీ టారిఫ్ లు ఆపకపోతే, భారత్ తో వాణిజ్యం ఆపేస్తాం: ట్రంప్ హెచ్చరిక

భారత్ లో 100 శాతం టారిఫ్ లు మేం మాత్రం ఏమీ వసూలు చేయడం లేదు ఇవి ఆగిపోవాలి… లేదంటే వాణిజ్యాన్ని ఆపేయాల్సి ఉంటుంది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ద్వైపాక్షిక వాణిజ్యం విషయంలో మరో సారి భారత్ కు హెచ్చరికలు జారీ చేశారు. ఇతర దేశాలతో పారదర్శక వాణిజ్యం కోసం అమెరికా అవసరమైనన్ని చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ‘‘నేను చెప్పేదేమంటే… మాకు భారత్ ఉంది. అక్కడ కొన్ని టారిఫ్ లు 100 శాతంగా ఉన్నాయి. కానీ, మేం మాత్రం ఏమీ చార్జీ వసూలు చేయడం లేదు. మేం అలా చేయం. అందుకే అన్ని దేశాలతో మాట్లాడుతున్నాం. ఈ విధమైన టారిఫ్ లు ఆగిపోవాలి. లేదా వారితో వాణిజ్యాన్ని మేం ఆపేయాల్సి ఉంటుంది’’ అని జీ7 సదస్సుపై వివరించేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ట్రంప్ భారత్…

ఇంకా ఉంది