ఆయుష్మాన్ భారత్… ఆరోగ్య బీమా పథకానికి అర్హతలివి!

వచ్చే నెల నుంచి అమలులోకి ఆరోగ్య బీమా పథకం సుమారు 50 కోట్ల మందికి లబ్ధి నిరుపేదలు, అట్టడుగు, బడుగు బలహీన వర్గాలకు లాభం ప్రతి కుటుంబానికీ సంవత్సరానికి రూ. 5 లక్షల ఆరోగ్య బీమాను దగ్గర చేసేలా ‘ఆయుష్మాన్ భారత్’ పథకాన్ని వచ్చే నెల నుంచి ప్రారంభించనున్నట్టు నిన్న ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించిన సంగతి తెలిసిందే. సుమారు 50 కోట్ల మందికి ఈ పథకం లబ్ధిని చేకూర్చనుంది. ఈ పథకానికి అర్హత పొందాలంటే, గ్రామీణ ప్రాంతాల్లో కచ్చా గోడలు, కచ్చా పైకప్పుతో ఒకే గదిలో నివాసముంటున్న కుటుంబాలు, మహిళ కుటుంబ పెద్దగా ఉన్న కుటుంబాలు, దివ్యాంగులు ఉన్న కుటుంబాలు, ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు, రోజువారీ కూలీపై ఆధారపడిన భూమి లేని కుటుంబాలు కూడా అర్హతను పొందుతాయి. అనాథలు, యాచకులు పారిశుద్ధ్య పని చేసే కుటుంబాలు,…

readMore

పనిలో కొంచెం సాయం చేయరూ!

ఇలా చెప్పుకుంటూ పోతే… చాలామంది మహిళలు తమ భర్తల సహాయ నిరాకరణ గురించి ఎన్నయినా చెబుతారు కదూ… ఇకపై ఆ ఫిర్యాదులు తగ్గాలంటే…మన ఇళ్లల్లోని మగవాళ్లు సాయం చేసేలా వాళ్లలో స్ఫూర్తిని రగిలిద్దామా… ‘‘ఇక్కడ పుల్ల తీసి అక్కడ పెట్టరు…’’ ‘‘అన్నీ కూర్చున్న చోటికి తీసుకెళ్లి ఇవ్వాలి…’’ ‘‘ఓపికలేకపోయినా కూడా నేనే చేయాలి తప్ప సాయం చేయాలనే ఆలోచన ఉండదు…’’ ‘తను పొద్దున్నే వంటచేసి ఉద్యోగానికి వెళ్లిపోతే… మిగిలిన పనులన్నీ నేను పూర్తిచేస్తా. వంటింటి గట్టు తుడవడం నుంచీ ఇల్లు సర్దడం, అవసరమైతే కూరలూ, ఇతర సరుకులు తీసుకోవడం… ఇలా అన్నీ పూర్తిచేసి నేను ఆఫీసుకు వెళ్తా. భార్య కూడా ఉద్యోగే కాబట్టి ఇంట్లో ఆ మాత్రం సాయం అందివ్వాలిగా…’ అని అంటారు హైదరాబాద్‌కు చెందిన భాస్కర్‌. కానీ అందరిళ్లలో ఈ పరిస్థితి ఉండదు. ఉదయం అయిదుగంటలకు…

readMore

అతివేగానికి.. రూ.32లక్షల జరిమానా

లంబోర్గిణి హరికేన్‌లో చక్కర్లు కొట్టినందుకు ఫలితం విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి రోడ్లపై డ్రైవింగ్‌ చేయాలంటే ట్రాఫిక్‌ నిబంధనలతో పాటు, నిబంధనల ఉల్లంఘనలకు ఎంతెంత జరిమానాలు వేస్తారో ముందే తెలుసుకోవడం మంచింది. ఎందుకంటే దుబాయిలో కారులో అతి వేగంగా వెళ్లినందుకు ఓ ప్రయాణికుడికి విధించిన జరిమానా ఎంతో తెలిస్తే షాక్‌ అవ్వకుండా ఉండలేరు. ఆ జరిమానా అక్షరాలా రూ.32లక్షలు. లంబోర్గిణి కారును చాలా వేగంగా నడిపిన బ్రిటిష్‌ పర్యాటకుడికి దుబాయ్‌ పోలీసులు ఇంత మొత్తంలో జరిమానా విధించారు. దుబాయ్‌ అంటే ఎత్తైన ఆకాశహర్మ్యాలు, భవనాలు, అందమైన రోడ్లే గుర్తొస్తాయి. అంతేగాకుండా ప్రంపంచంలోనే అత్యంత వేగంగా వెళ్లే, ఖరీదైన విదేశీ కార్లు ఇక్కడ ఉంటాయి. వీధి వీధిలో సూపర్‌కార్లు కనిపిస్తూనే ఉంటాయి. అత్యంత వేగంగా వెళ్లే బుగాటి, లంబోర్గిణి, తదితర విదేశీ కార్ల వల్ల దుబాయ్‌ పోలీసులకు ట్రాఫిక్‌ను అదుపులో…

readMore

చిన్నపాటి మనస్పర్థలకే కూలుతున్న కాపురాలు

స్వల్ప వివాదాలతో విడిపోతున్న జంటలు మహానగరంలో ఏటేటా పెరుగుతున్న విడాకుల కేసులు సర్దుబాటు ధోరణి నశించడమే కారణమంటున్న నిపుణులు పెద్దలు కుదిర్చిన పెళ్లి. చూడచక్కని జంట. ఏడాది తిరక్కుండానే పండంటి బిడ్డ పిల్లాడు. చిన్నారిని ఊయల్లో వేసే రోజు ఇల్లంతా సందడి. దంపతుల మధ్య మాత్రం వాగ్వాదం. అసలు విషయం ఏమిటంటే.. ఇరువైపు కుటుంబాల్లో పూజా కార్యక్రమాలు భిన్నంగా నిర్వహిస్తుంటారు. పిల్లాడి వేడుక తమ ఆచారం ప్రకారం జరగాలంటే.. తమ ఆచారమే అనుసరించాలంటూ ఇరువురూ పట్టుదలకు పోవడం గొడవకు దారితీసింది. భర్తపై.. ఇల్లాలు కేసు పెట్టింది. ఇదే కారణంతో భర్త విడాకుల కోసం న్యాయస్థానం వరకూ వెళ్లాడు. భార్యభర్తల మధ్య చిన్నచిన్న మనస్పర్థలు చినికిచినికి గాలివానగా మారుతున్నాయి. నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాల్సిన సమస్యలు ఠాణా వరకూ చేరుతున్నాయి. నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయిలో వాదులాడుకుంటున్న…

readMore

సాహసమే ఊపిరి థాయ్‌లాండ్‌లో జూనియర్‌ ఫుట్‌బాల్‌ జట్టుకు విముక్తి

ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన థాయ్‌లాండ్‌ ‘గుహ నిర్బంధం’ కథ సుఖాంతమైంది. కబళించడానికి సిద్ధంగా ఉన్న వరదనీటి నడుమ 18 రోజుల పాటు చీకటి గుహలో బిక్కుబిక్కుమంటూ గడిపిన 12 మంది ఫుట్‌బాల్‌ జట్టు బాలలు, వారి కోచ్‌ సురక్షితంగా బయటపడ్డారు. ఇప్పటికే 8 మందిని రక్షించిన సహాయ బృందాలు.. మంగళవారం మిగతా నలుగురితోపాటు వారి కోచ్‌కు విముక్తి ప్రసాదించాయి. దీంతో అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో ఎంతో రిస్కుతో చేపట్టిన ఈ సంక్లిష్ట ఆపరేషన్‌ ముగిసింది. విదేశాల నుంచి వచ్చిన గజ ఈతగాళ్లు, థాయ్‌ నౌకాదళానికి చెందిన సుశిక్షిత నౌకాదళ ‘సీల్స్‌’ బృందం మంగళవారం తుది ఆపరేషన్‌ నిర్వహించి, నలుగురు బాలలు, 25 ఏళ్ల కోచ్‌ను గుహ నుంచి వెలుపలికి తెచ్చాయి. నీటితో నిండిన ప్రమాదకరమైన సన్నటి సొరంగ మార్గాల గుండా పయనిస్తూ వారు ఈ కార్యక్రమాన్ని పూర్తిచేశారు.…

readMore